
దేశంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన గుర్తింపు ధృవీకరణ పత్రాలలో ఒకటి ఆధార్ కార్డు అయితే.. రెండోది పాన్ కార్డ్ అని చెప్పవచ్చు. ఈ రెండు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్. ఈ రెండూ ప్రత్యేక అవసరాలను తీర్చుతుంది. ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగపడితే.. పాన్ బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు వంటి వాటికి ఉపయోగపడుతుంది. ఆధార్, పాన్ కార్డు దేనికది ప్రత్యేకతను కలిగి ఉంది. పాన్ కార్డ్ లేకుండా మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు దేశంలో చేయలేరు. అందుకే ప్రతీఒక్కరూ పాన్ కార్డు అనేది కలిగి ఉంటారు. చిన్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ అవకాశం కల్పిస్తోంది.
మీ ఆదాయం, పన్నులు, మీరు చేసే ఖర్చులకు సంబంధించిన ప్రతీ సమాచారం పాన్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాన్ కార్డులోని వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. వివరాల్లో తేడాలు ఉంటే మీరు చాలా సేవలు పొందలేరు. ధృవీకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా పాన్ కార్డుపై పాత ఫొటో ప్రింట్ అయి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది మీ రూపంలో మార్పులు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఆ ఫోటో మీ అసలు రూపానికి సరిపోలకపోతే సమస్యలు తలెత్తవచ్చు. అదే ఫొటోను మార్చుకోవడం ఎలా ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
– NSDL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
-అవసరమైన సమాచారాన్ని ఇక్కడ పూరించాలి
-పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి
– క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి
-కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయండి
– అనంతరం ఫోటో మార్చే ఆప్షన్‌ను ఎంచుకోండి
-చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయండి
– ‘డిక్లరేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-రూ.101 ఫీజు చెల్లించండి
-నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు
-15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది
– ఈ నంబర్‌ను ఆదాయపు పన్ను పాన్ సేవా విభాగానికి పంపండి
-అనంతరం మీ పాన్ కార్డుపై మీ ఫోటో అప్‌డేట్ అవుతుంది