Aadhaar PAN link: ఈ తేదీకి ముందే ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే మీరు పెనాల్టీ నుండి తప్పించుకోలేరు..
PAN-Aadhaar linking: ఇంతకుముందు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు మార్చి 31న నిర్ణయించబడింది. అయితే తర్వాత దానిని జూన్ 30, 2023 వరకు పొడిగించారు. ఇప్పుడు ఆధార్ నంబర్‌తో లింక్ చేయని పాన్ కార్డులు జూలై 1 నుంచి..
మీరు ఇంకా పాన్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే.. ఆ పనిని త్వరగా పూర్తి చేయండి. ఎలాంటి పెనాల్టీ లేకుండా పాన్ – ఆధార్ లింక్ చేయడానికి గడువు దగ్గరపడింది. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే.. జూన్ 30లోపు ఈ పనిని పూర్తి చేయండి. ఈ పనులకు గడువును పొడిగించేందుకు ప్రభుత్వం అనుమతించగా.. ముందుగా మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. నిర్ణీత గడువు తర్వాత ఆధార్ కార్డుతో పాన్‌ను లింక్ చేసిన వారిపై ఆదాయపు పన్ను శాఖ రూ. 1000 జరిమానా విధిస్తుంది. చలాన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
UIDAI కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి వివరణాత్మక విధానాన్ని జారీ చేసింది. పాన్-ఆధార్ లింకింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రక్రియలు రెండూ UIDAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ఆధార్ కార్డ్‌తో పాన్‌ను ఎలా లింక్ చేయాలి..