Ola Electric Scooter: ఓలా నుంచి మరో కొత్త స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 320 కి.మీ దూరం!

Ola Electric Scooter: ఓలా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో ప్లస్‌ను కూడా విడుదల చేసింది. ఇది డ్రైవింగ్ రేంజ్ పరంగా దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ..

Ola Electric Scooter: ఓలా నుంచి మరో కొత్త స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌తో 320 కి.మీ దూరం!

Updated on: Feb 09, 2025 | 3:04 PM

ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త థర్డ్‌ జనరేషన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం జనవరి 31న విడుదల చేసింది. తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, కంపెనీ కొత్త శ్రేణితో కూడిన శక్తివంతమైన మోడల్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ పోర్ట్‌ఫోలియోలో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 79,999. దీనితో పాటు, ఓలా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో ప్లస్‌ను కూడా విడుదల చేసింది. ఇది డ్రైవింగ్ రేంజ్ పరంగా దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

ఈ లాంచ్ గురించి కంపెనీ యజమాని భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, కొత్తగా విడుదల చేసిన మూడవ తరం స్కూటర్‌ను అనేక ప్రధాన మార్పులతో మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు.

కొత్తగా ఏముంది?

కంపెనీ ఈ శ్రేణిలో S1 X, S1 X+, S1 Pro, S1 Pro+ లను చేర్చింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు ప్లస్ వేరియంట్‌ను జోడించడం ఇదే మొదటిసారి. కస్టమర్లు 2 kWh బ్యాటరీ ప్యాక్ నుండి 5.3 kWh బ్యాటరీ ప్యాక్ వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే Gen 3 లో కొత్త ‘బ్రేక్ బై వైర్’ టెక్నాలజీ కారణంగా కంపెనీ స్కూటర్ నుండి చాలా వైరింగ్‌లను తొలగించింది. దీనితో పాటు పాత జనరేషన్‌తో పోలిస్తే జనరేషన్‌ 3 పరిధి కూడా గణనీయంగా పెరిగింది.

S1 X (జనరేషన్ 3)

  • మీరు 2 kW, 3 kW, 4 kW అనే 3 బ్యాటరీ ప్యాక్‌లను కొనుగోలు చేయవచ్చు.
  • గరిష్ట వేగం గంటకు 123 కిలోమీటర్లు.
  • పరిధి- 242 కి.మీ
  • ధర- 2 kWh బ్యాటరీ ప్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999. 3 kWh బ్యాటరీ ప్యాక్ రూ. 89,999, 4 kWh బ్యాటరీ ప్యాక్ రూ. 99,999.

S1 X+ (జనరేషన్ 3):

  • 1 బ్యాటరీ ప్యాక్- 4 kW
  • గరిష్ట వేగం గంటకు 125 కి.మీ.
  • పరిధి- 242 కి.మీ.
  • ధర- రూ. 1,07,999

S1 ప్రో (జనరేషన్ 3):

  • 2 బ్యాటరీ ప్యాక్‌లు – 3 kW, 4 kW
  • గరిష్ట వేగం 125 kmph
  • పరిధి – 242 km
  • ధర – 3 kW ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,14,999, 4 kW బ్యాటరీ ప్యాక్ ధర రూ. 1,34,999

S1 ప్రో+ (జనరేషన్ 3):

  • 2 బ్యాటరీ ప్యాక్‌లు – 4 kW, 5.3 kW
  • గరిష్ట వేగం 141 kmph
  • పరిధి 320 కి.మీ
  • ధర – 4 kW బ్యాటరీ ప్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,54,999, 5.3 kW బ్యాటరీ ప్యాక్ ధర రూ. 1,69,999.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి