Hyundai Exter CNG: సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్.. టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీ

భారతదేశంలోని ఆటోమొబైల్ రంగాన్ని ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు శాసిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమంది ప్రజలకు ఈవీ వాహనాలపై అంతగా నమ్మకం ఉండట్లేదు. ముఖ్యంగా కార్లు కొనుగోలు చేయాలని అనుకునేవారు కచ్చితంగా ఈవీలకు ప్రత్యామ్నాయ ఎంపికల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారికి సీఎన్‌జీ వాహనాలు ఈవీలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా తమ కారు మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఎక్స్టర్ సీఎన్‌జీని భారత మార్కెట్లో విడుదల చేసింది.

Hyundai Exter CNG: సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్.. టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీ
Hyundai Exter Cng
Follow us

|

Updated on: Jul 17, 2024 | 3:00 PM

భారతదేశంలోని ఆటోమొబైల్ రంగాన్ని ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు శాసిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమంది ప్రజలకు ఈవీ వాహనాలపై అంతగా నమ్మకం ఉండట్లేదు. ముఖ్యంగా కార్లు కొనుగోలు చేయాలని అనుకునేవారు కచ్చితంగా ఈవీలకు ప్రత్యామ్నాయ ఎంపికల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారికి సీఎన్‌జీ వాహనాలు ఈవీలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా తమ కారు మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఎక్స్టర్ సీఎన్‌జీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ వాహనాల ధరలు రూ.8.50 లక్షల నుంచి రూ.9.38 లక్షల వరకు ఉంటాయని అంచనా. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ టాటా పంచ్ సీఎన్‌జీకి గట్టి పోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీకి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హ్యూందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లతో వస్తుంది. ముఖ్యంగా కారు డిక్కీలో సామగ్రి పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే ఈ కారు 1.21 బై ఫ్యూయల్ టెక్నాలజీతో వస్తుంది. అయితే ఈ వెర్షన్‌లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండదు.హ్యుందాయ్  ఎక్స్‌టర్ సీఎన్‌జీ కారు 27.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని అంచనా. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి అధునాత ఫీచర్లు ఈ కారు సొంతం. 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా లక్షణాలతో ఈ కారు అమితంగా ఆకర్షిస్తుంది.

హ్యుందాయ్ ఇటీవల 93,000 ఎక్స్‌టర్ యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వారు ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేశారు. ఎక్స్‌టర్ హై-సీఎన్జీ డ్యూయో పరిచయం గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మిస్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ అధిక ఇంధన సామర్థ్యం, విస్తారమైన బూట్ స్పేస్‌తో ఈ కారు భారతీయ రోడ్లకు అనువుగా డిజైన్ చేసినట్టు వివరించారు. ఈ కారు కచ్చితంగా వినియోగదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందని చెప్పారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్..!
సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్..!
వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..