గుడ్‌న్యూస్‌..సికింద్రాబాద్‌ నుంచి ఈ రూట్లలో తొలి వందేభారత్‌ స్లీపర్‌

13 July 2024

TV9 Telugu

భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు గొప్ప సౌకర్యాన్ని కల్పించింది. 

వందే భారత్ రైల్

ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ  మొదటి వందే భారత్ స్లీపర్‌ సికింద్రాబాద్ నుండి ముంబై మార్గంలో నడిచే అవకాశం ఉంది.

వందే భారత్ 

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. రైల్వే బోర్డుకు ఆయన ప్రతిపాదన పంపారు. 

దక్షిణ మధ్య రైల్వే

ఈ నగరాల మధ్య ప్రస్తుతం వందేభారత్ ఏదీ నడపడం లేదని, ఈ మార్గంలో మాత్రమే మొదటి స్లీపర్ వందే భారత్ రైలును నడపాలని  రైల్వే జీఎం అరుణ్ కుమార్‌కు సూచించారు. 

వందేభారత్ 

అదే సమయంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో చైర్ కార్ వందే భారత్‌ను సికింద్రాబాద్-పుణే మధ్య ప్రారంభించవచ్చని మరో సమాచారం వెలుగులోకి వచ్చింది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ (సిట్టింగ్) రైలు రానున్నట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్-పూణే

కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ రైలుకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ మార్గంలో వందేభారత్‌ను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కాచిగూడ-బెంగళూరు

వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు ఉంటుందని, ఇది ఇతర రైళ్ల కంటే చాలా ఎక్కువ. ఇందులో పడుకునే, కూర్చునే సీట్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

వందే భారత్ స్లీపర్