Stock Market: కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్.. ఈ రోజు ఎలా ఉండబోతుందంటే..

గత శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‎ను కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ భయాలతో సూచీలు బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...

Stock Market: కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్.. ఈ రోజు ఎలా ఉండబోతుందంటే..
Stock Market

Updated on: Nov 29, 2021 | 7:16 AM

గత శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‎ను కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ భయాలతో సూచీలు బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు జులై-సెప్టెంబరు జీడీపీ గణాంకాలు, ఒపెక్‌ సమావేశ నిర్ణయాలు, అమెరికా పీఎంఐ వంటివి కీలకం మారనున్నాయి. చిన్న, మధ్య స్థాయి షేర్ల క్షీణత కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ విక్రయ గణాంకాలు ప్రకటించనుండటంతో వాహన షేర్లు కాస్త పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ వారం రెండు కొత్త ఐపీఓలు రానున్నాయి. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్ ఐపీఓగా రానున్నాయి.

బలహీన సెంటిమెంట్‌తో మదుపర్లు రక్షణాత్మక షేర్ల వైపు చూడటం కలిసిరానుంది. జియో కూడా టారిఫ్‌లు పెంచినందున టెలికాం కంపెనీల షేర్లపై ప్రభావం చూపవచ్చు. శుక్రవారం, BSE సెన్సెక్స్ 1,687.94 పాయింట్లు అంటే 2.87 శాతం తగ్గి 57,107.15 వద్ద ముగియగా, నిఫ్టీ 509.80 పాయింట్లు అంటే 2.91 శాతం పడిపోయి 17,026.50 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పడిపోయాయి.

Read Also… New Rules From 1 December: డిసెంబర్ 1 వచ్చేస్తోంది.. మీ ఖర్చులు తగ్గనున్నాయి.. ఎందుకో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us