Central Government: ఇన్‌కమింగ్ కాల్స్‌కు కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..

మీకు ఎవరి నుంచైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు వారి పేరు మీరు ఇప్పటికే కాల్ లిస్టులో సేవ్ చేసుకుని ఉంటే.. మొబైల్ స్క్రీన్‌పై మీకు కనిపిస్తుంది. సేవ్ చేసుకోకపోతే కేవలం నెంబర్ మాత్రమే కనబడుతుంది. అయితే నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానుంది.

Central Government: ఇన్‌కమింగ్ కాల్స్‌కు కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..
Mobile Caller Name

Updated on: Oct 15, 2026 | 12:12 PM

స్పామ్ కాల్స్‌ ద్వారా ఇటీవల అనేక మోసాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా సైబర్ మోసాల బారిన ఎక్కువమంది పడుతున్నారు. ఇప్పటికే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం అనేక కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. అయితే నవంబర్ 1 నుంచి టెలికమ్యూనికేషన్ విభాగం(DoT) కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. అదే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్. దీనిని వచ్చే నెల ఒకటో లేదీ నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల మీకు ఎవరైనా కాల్ చేస్తే.. వారి పేరు మీ మొబైల్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. సిమ్ తీసుకున్నప్పుడు టెలికాం రికార్డుల్లో పేరు ఎలా అయితే నమోదైదో.. ఆ పేరు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ ఫీచర్ వల్ల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను నియంత్రించడంతో పాటు ఎవరు చేశారనేది సులువుగా గుర్తించవచ్చు.

ప్రస్తుతం కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ మాత్రమే మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక నుంచి నెంబర్‌తో పాటు వ్యక్తి పేరు కూడా ప్రదర్శిస్తారు. ఒకవేళ మీరు ఇప్పటికే పేరు మొబైల్‌లో సేవ్ చేసుకుని ఉంటే ఆ పేరు మాత్రమే కనబడుతుంది. మీరు సేవ్ చేసుకుంటే ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు టెలికాం రికార్డుల్లో ఉన్న పేరును ప్రదర్శించబడుతుంది. ఇక అంతర్జాతీయ కాల్స్‌కు సంబంధించి ఇంటర్నేషనల్ కాల్ అనే పేరుతో పాటు నెంబర్ ప్రదర్శిస్తారు. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(CNP) ఫీచర్ ద్వారా దీనిని టెలికాం కంపెనీలు అమలు చేయనున్నాయి. అక్టోబర్ 13వ తేదీన దీనికి సంబంధించి భారత టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ సర్క్యూలర్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి తప్పనిసరిగా పేరు ప్రదర్శించాలని ఆదేశించింది. దీంతో నవంబర్ 1 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానుంది. మీకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌లో ఫోన్ చేసే వ్యక్తి మీ మొబైల్ ఫోన్‌పై ముందే చూడవచ్చు. ప్రస్తుతం ట్రూ కాలర్ లాంటి యాప్స్ ద్వారా పేరు తెలుసుకునే ఫీచర్ ఉండగా.. ఇప్పుడు ఆ యాప్ అవసరం తప్పుతుంది.

అయితే ఈ సేవ కోసం మొబైల్ వినియోగదారులు టెలికాం కంపెనీలకు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి పని లేదు. అంతేకాకుండా ఈ సేవను సబ్‌స్కైబ్ లేదా యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేరుగా ప్రతీఒక్కరికీ ఉచితంగా ఈ సేవలను అందిస్తారు. దీంతో కాల్ స్వీకరించేముందు వ్యక్తి పేరును మొబైల్ వినియోగదారులు తెలుసుకోవచ్చు. స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌ను గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది. అయితే కాలింగ్ లైన్ ఐడెంటికేషన్ రిస్ట్రిక్షన్ ఆప్షన్ ఎంచుకున్నవారికి పేరు ప్రదర్శించబడదు. ఇక బల్క్ కనెక్షన్లు ఉన్న కంపెనీలకు జీఎస్టీ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ పేరును ప్రదర్శించడానికి అనుమతించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us