Aadhaar Card: ఆధార్ వాడేవారికి సూపర్ న్యూస్.. ఇకపై జిరాక్స్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ ద్వారానే..

యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి పూర్తిస్థాయి వెర్షన్ ప్రారంభించింది. అయితే ఈ యాప్‌లో అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఆధార్ అవసరమైన చోట క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు పంచుకోవచ్చు.

Aadhaar Card: ఆధార్ వాడేవారికి సూపర్ న్యూస్.. ఇకపై జిరాక్స్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
Aadhaar App

Updated on: Jun 01, 2026 | 4:54 PM

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎంఆధార్ యాప్‌ సేవలను పూర్తిగా నిలిపివేసిన యూఐడీఏఐ.. దాని స్థానంలో ఆధార్ పేరుతో కొత్త యాప్ పూర్తి స్థాయి వెర్షన్ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడైనా ఆధార్ అవసరమైతే ఆధార్ ఒరిజినల్ చూపించడం లేదా ఆధార్ జిరాక్స్ కాపీ అందించడం లాంటివి చేయాల్సి వచ్చేది. కానీ దీని వల్ల ఆధార్ దుర్వినియోగం అవుతుంది. జిరాక్స్ కాపీ ద్వారా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత వివరాలను ఉపయోగించి అక్రమాలకు పాల్పుడుతున్నారు. దీంతో ప్రజల వ్యక్తిగత వివరాలకు రక్షణ కల్పించేందుకు, ఆధార్‌ను ప్రజలు సురక్షితంగా వాడుకునేందుకు కొత్త యాప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది.

కొత్త ఫీచర్లు ఏంటంటే..?

ఇక నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన పనే లేదు. ఆధార్ అవసరమైన చోట క్యూఆర్ కోడ్‌తో ధృవీకరణ పూర్తి చేయవచ్చు. మీరు యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను పంచుకుంటే సరిపోతుంది. మీరు ఏయే వివరాలు పంచుకుంటున్నారనేది ఎంపిక చేసుకుని క్యూఆర్ కోడ్ షేర్ చేయాలి. దీంతో ఆయా వివరాలు మాత్రమే ఎదుటి వ్యక్తికి కనిపిస్తాయి. హోటళ్లు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా ఆధార్ ధృవీకరణ అవసరమైన చోట ఫొటో కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా క్యూఆక్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేవయవచ్చు. మీ ఆధార్ వ్యక్తిగత వివరాలు ఇతర వ్యక్తులకు తెలియకుండా ఇది భద్రత కల్పి్స్తుంది.

ఫేస్ రికగ్నిషన్ ఫీచర్

ఇక కొత్త ఆధార్ యాప్‌లో ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది. అంటే. . గతంలో ఓటీపీ ద్వారా ఆధార్ యాక్సెస్ పూర్తయ్యేది. కానీ ఇక నుంచి ఫేష్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు ధృవీకరణ పూర్తి చేవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌కు అదనపు భద్రత లభిస్తుంది. ఇక కొత్త యాప్‌లో ఉన్న ఫీచర్ ఏంటంటే.. ఒకేచోట మీ కుటుంబసభ్యుల ఆధార్లను కూడా యాడ్ చేయవచ్చు. కుటుంబానికి చెందిన ఆధార్లను ఒకేచోట యాక్సెస్ చేయవచ్చు.

కొత్త యాప్ సెటప్ చేసుకోండిలా..?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ పేరుతో ఉండే యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

-యాప్‌ను తెరిచి బాషను ఎంచుకోండి

-మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

-ఓటీపీని ధృవీకరించండి

-ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ పూర్తి చేయండి

-ఆరు అంకెల పిన్ సెట్ చేసుకోండి

-ఆధార్ వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి

-ఇప్పుడు మీ ఆధార్ యాప్ యాక్టివ్ అవుతుంది

 

Follow Us