రూ. లక్ష పెట్టుబడి రూ. 3.37 కోట్లుగా మారింది.. కోటీశ్వరులను చేసిన హైదరాబాద్ మల్టీబ్యాగర్ స్టాక్‌ ఏంటో తెలుసా?

Multibagger Stocks: హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ షేర్ ధర రూ. 1.63 (ఎన్‌ఎస్‌ఇలో 8 జనవరి 2010న ముగింపు ధర) నుంచి రూ. 550.05కి పెరిగింది (30 డిసెంబర్ 2021న ఎన్‌ఎస్‌ఇలో ముగింపు ధర).

రూ. లక్ష పెట్టుబడి రూ. 3.37 కోట్లుగా మారింది.. కోటీశ్వరులను చేసిన హైదరాబాద్ మల్టీబ్యాగర్ స్టాక్‌ ఏంటో తెలుసా?
Money
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2022 | 8:45 AM

Multibagger Stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు సహనం చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే స్టాక్‌లను కొనడం, అమ్మడమే కాదు.. వేడి చూడడం కూడా అందులో ముఖ్యమైనది. అవంతి ఫీడ్స్ షేర్లు దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ షేర్ ధర NSEలో రూ.1.63 (8, జనవరి 2010న ముగింపు ధర) నుంచి రూ. 550.05 (ఎన్‌ఎస్‌ఈ 30 డిసెంబర్ 2021న ముగింపు ధర)కి పెరిగింది. దాదాపు 12 ఏళ్ల వ్యవధిలో ధర దాదాపు 33,650 శాతం పెరిగింది.

అవంతి ఫీడ్స్ షేర్ ధర.. గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 525 నుంచి రూ. 550కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 5 శాతం వృద్ధి చెందింది. గత 6 నెలల్లో, అవంతి ఫీడ్స్ షేరు ధర రూ. 545.85 నుంచి రూ. 550.05కి పెరిగింది. అదే కాలంలో 1 శాతం కంటే తక్కువ. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ తన వాటాదారులకు దాదాపు 5 శాతం రాబడిని ఇస్తోంది. కానీ, గత 5 సంవత్సరాలలో, మల్టీబ్యాగర్ షేర్ ధర దాదాపు రూ. 175 నుంచి రూ.550కి చేరుకుంది. గత 12 ఏళ్లల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఒక్కో షేరు రూ. 1.63 నుంచి రూ. 550 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 337 రెట్లు పెరిగింది.

అవంతి ఫీడ్స్ షేర్ ధర చరిత్రను కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఈరోజు రూ. 1.05 లక్షలుగా మారేది. ఒక ఇన్వెస్టర్ 5 సంవత్సరాల క్రితం ఈ షేర్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రస్తుతం రూ. 3.10 లక్షలు అవుతుంది. ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే నేడు రూ. 56.50 లక్షలు అవుతుంది. అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు 12 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష నేడు రూ. 3.37 కోట్లుగా మారింది.

Also Read: ITR: గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసిన 5.89 కోట్ల మంది.. చివరి రోజు 46.11 లక్షలకు పైగా దాఖలు..

Elon Musk: మస్క్ నోట శ్రీమంతుడు సినిమా మాట.. ఎంత తీసుకున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాలటా..