Electric Cycle: పిచ్చెక్కించే ఫీచర్లతో “ఎలక్ట్రిక్ సైకిల్”.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు !

మారుతున్న కాలానుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో కారుకు ప్రత్యామ్నాయంగా మారేలా ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ 'మోనార్క్' తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ‘మోనార్క్ ట్రేసర్’ను (Tracer) మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సైకిల్ ఫీచర్స్ మీకోసం..

Electric Cycle: పిచ్చెక్కించే ఫీచర్లతో ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు !
Monarc Tracer Electric Cycle

Updated on: Nov 20, 2026 | 6:25 PM

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో కారుకు ప్రత్యామ్నాయంగా మారేలా ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ ‘మోనార్క్’ తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ‘మోనార్క్ ట్రేసర్’ను (Tracer) మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తున్న ఈ సైకిల్.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 209 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్‌ను అందిస్తుండటం ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సూపర్ సైకిల్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ప్రత్యేకతలు, ధర వివరాలివే..

రెండు బ్యాటరీలు: సాధారణ ఈ-బైకులలో ఒకే బ్యాటరీ ఉంటుంది. కానీ ఇందులో రిమూవబుల్ 48V, 15Ah (720Wh) సామర్థ్యం గల రెండు ఎల్జీ-సెల్ (LG-cell) బ్యాటరీ ప్యాకులను అందించారు.

లాంగ్ రేంజ్: ఒక్కో బ్యాటరీ సుమారు 104 కిలోమీటర్ల మైలేజీనిస్తుండగా, రెండు బ్యాటరీలు కలిపి 209 కిలోమీటర్ల (130 మైళ్లు) వరకు నాన్‌స్టాప్ ప్రయాణానికి వీలు కల్పిస్తాయి.

స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్: దీనితో పాటు 48V, 5A ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. బ్యాటరీ జీవితకాలాన్ని పెంచేందుకు గరిష్ట ఛార్జ్ శాతాన్ని మనమే సెట్ చేసుకునే స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్యాటరీలను సులభంగా బయటకు తీసి ఇంట్లో లేదా ఆఫీసులో ఛార్జ్ చేసుకోవచ్చు.

హెవీ పవర్: ఇందులో 720W బఫాంగ్ (Bafang) రియర్ హబ్ మోటార్‌ను అమర్చారు. ఇది 30-యాంపియర్ కంట్రోలర్‌తో కలిసి 1,638W పీక్ పవర్, 85Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సులభమైన ప్రయాణం: ఎత్తైన కొండ ప్రాంతాలు, ఎగుడుదిగుడు దారుల్లోనూ ఏమాత్రం తడబడకుండా సులభంగా దూసుకెళ్లవచ్చు.

టాప్ స్పీడ్: పెడల్ అసిస్ట్, థ్రాటిల్ మోడ్స్ ఉన్న ఈ సైకిల్ గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు.

హైడ్రాలిక్ బ్రేకులు: ప్రయాణికుల భద్రత కోసం ఇందులో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. తడి రోడ్లపైనా ఇవి తక్షణమే సైకిల్‌ను నియంత్రిస్తాయి.

డిజిటల్ డిస్‌ప్లే: హ్యాండిల్‌బార్ మధ్యలో ఉన్న కలర్ ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లేపై వేగం, బ్యాటరీ శాతం, ప్రయాణించిన దూరం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

అదనపు సదుపాయాలు: మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, రాత్రిపూట ప్రయాణాలకు పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వెనుక బ్రేక్ లైట్, సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా దృఢమైన రియర్ ర్యాక్ (Rear Rack) ఇచ్చారు.

సౌకర్యవంతమైన రైడింగ్: నిటారుగా కూర్చుని నడిపే రైడింగ్ పొజిషన్ వల్ల వెన్నునొప్పి, అలసట తగ్గడమే కాకుండా ట్రాఫిక్‌లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది.

అందరికీ అనువుగా: స్టెప్-త్రూ మోడల్‌ను 5 అడుగుల 2 అంగుళాల నుంచి 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నవారు ఎంతో సౌకర్యవంతంగా నడపవచ్చు.

లోడ్ కెపాసిటీ & టైర్లు: ఇది 150 కిలోల రైడర్ బరువుతో పాటు మొత్తం 191 కిలోల లోడ్‌ను మోయగలదు. గతుకుల రోడ్లపై సాఫీ ప్రయాణం కోసం 80mm సస్పెన్షన్ ఫోర్క్, 27.5 x 2.2-అంగుళాల వెడల్పు గల పంక్చర్ రెసిస్టెంట్ టైర్లను అమర్చారు.

డిజైన్ & కలర్స్: ఈ ఎలక్ట్రిక్ సైకిల్ హై-స్టెప్, స్టెప్-త్రూ అనే రెండు ఫ్రేమ్ డిజైన్లలో.. టాకోనైట్, సుపీరియర్, బిర్చ్‌వుడ్, జూన్‌బెర్రీ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ధర: డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధరను 1,899 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1.78 లక్షలు)గా నిర్ణయించారు. బ్యాటరీ లేని/బేస్ వేరియంట్ ధర 1,399 డాలర్లు (దాదాపు రూ. 1.31 లక్షలు)గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us