Maruti Suzuki: సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి.. లాంచింగ్ ఎప్పుడంటే..

|

Apr 28, 2024 | 5:47 PM

జపాన్ కు చెందిన ఈ కార్ల దిగ్గజం సుజుకీ దీని కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం చిన్నపాటి హైబ్రీడ్ కార్ల తయారీపై సుజుకీ ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్ల కంటే ఇవి ఎక్కువ మైలేజీ వస్తాయని ఆయన వివరించారు. మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ హైబ్రిడ్ కార్ల గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Maruti Suzuki: సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి.. లాంచింగ్ ఎప్పుడంటే..
Maruti Suzuki
Follow us on

దేశంలో మారుతి సుజుకీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అనువైన బడ్జెట్లో అనేక రకాల కార్లు మనకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్, సీఎన్జీ కార్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మారుతి నుంచి హైబ్రీడ్ కార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. జపాన్ కు చెందిన ఈ కార్ల దిగ్గజం సుజుకీ దీని కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం చిన్నపాటి హైబ్రీడ్ కార్ల తయారీపై సుజుకీ ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్ల కంటే ఇవి ఎక్కువ మైలేజీ వస్తాయని ఆయన వివరించారు. మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ హైబ్రిడ్ కార్ల గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టయోటా నుంచి అందుబాటులో..

అంతర్జాతీయ మార్కట్లో ఇప్పటికే టయోటా కంపెనీ హైబ్రీడ్ కార్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ కార్లలో వినియోగిస్తున్న సాంకేతిక చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. అందుకే ఈ హై బ్రీడ్ కార్ల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి చవకైన ధరలకే హైబ్రీడ్ కార్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే చిన్నపాట హైబ్రీడ్ కార్లను వీలైనంత అనువైన ధరలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అయితే అందుకు ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం హై బ్రీడ్ కార్లపై విధిస్తున్న జీఎస్టీ చాలా ఎక్కువగా ఉందని.. దానిని తగ్గిస్తేనే తక్కువ ధరకు హైబ్రీడ్ కార్లను తీసుకొచ్చే వీలుంటుందని స్పష్టం చేశారు.

43శాతం జీఎస్టీ..

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 5శాతం డీఎస్టీ విధిస్తున్నారు. అదే సమయంలో హైబ్రీడ్ కార్లలో మాత్రం ఏకంగా 43శాతం ట్యాక్స్ పడుతోందని ఆర్సీ భార్గవ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కార్ల ధరలు కూడా అనివార్యంగా పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కార్ల జీఎస్టీని తగ్గించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించగా.. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారని భార్గవ వివరించారు. హైబ్రీడ్ వాహనాలపై 5శాతం, ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలపై 12శాతానికి తగ్గించాలని కోరినట్లు చెప్పారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి హైబ్రీడ్ వాహనాల విస్తరణ, విక్రయాలు ఆధారపడి ఉంటాయని భార్గవ తేల్చి చెప్పారు. ప్రస్తుతం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో తమ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును ఈ సంవత్సరంలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని భార్గవ వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..