లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభంలో మంచి జోష్ మీద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉపశమనాలు స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఇవాళ ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11.17 సమయంలో సెన్సెక్స్ 133.13 పాయింట్లు పెరిగి 36834.29 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 30.55 పాయింట్ల లాభంతో 10859.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలపై విధించిన సర్‌ఛార్జిని తొలగించడంతోపాటు , దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్‌ […]

లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 11:28 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభంలో మంచి జోష్ మీద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉపశమనాలు స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఇవాళ ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11.17 సమయంలో సెన్సెక్స్ 133.13 పాయింట్లు పెరిగి 36834.29 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 30.55 పాయింట్ల లాభంతో 10859.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలపై విధించిన సర్‌ఛార్జిని తొలగించడంతోపాటు , దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును ఉపసంహరించుకోవడం మదుపరుల్లో జోష్‌ పెంచింది. దీంతోపాటు బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించడంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు వరంగా మారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.1750 గా ఉంది.