Mahindra Thar Electric: అద్దిరిపోయే లుక్, ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న థార్ ఇ.. ఫస్ట్ లుక్ రివ్యూ..

|

Aug 18, 2023 | 8:29 AM

మహీంద్రాలో థార్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే థార్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తోంది. ‘థార్ - ఇ’ పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ కారు ఫస్ట్‌ లుక్‌ను మహీంద్రా కంపెనీ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ థార్ వెర్షన్ ఫస్ట్ లుక్, ఫీచర్ అద్దిరిపోయేలా ఉంది. ఇప్పటి వరకు చూడని రూపుతో సరికొత్తగా ఉంది. ఈ కారు స్పెషాలిటీస్, ఫీచర్స్, లుక్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 6

2 / 6
‘థార్ - ఇ’ ప్రస్తుత థార్‌కి దీనికి చాలా తేడా ఉంది. రెండింటి మధ్య ఏమాత్రం పోలికలు లేకుండా ఉంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అలాగే ఇది ఎలక్ట్రిక్ రేంజ్ పరంగా చాలా అనువైనది.

3 / 6
‘థార్ - ఇ’ SUV మోడల్‌లో కాకుండా.. ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్‌తో వస్తుంది. దానిలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్లు దీనికి తగినంత టార్క్ ఉత్పత్తి చేసే శక్తినిస్తాయి. దీని కారణంగా ఇది ఎక్కువ రేంజ్‌ డ్రైవ్‌కు అవకాశం లభిస్తుంది. ఏదైనా హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

4 / 6
ఇది బాక్సీ శైలిలో, చతురస్రాకారంలో చూసేందుకు చాలా స్టైలీష్‌గా ఉంది. దీనికి 5 డోర్స్ ఇచ్చారు. అలాగే, కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ సాధారణ థార్ కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి.

5 / 6
ఇంటీరియర్‌ విషయానికి వస్తే అద్భుతమైన టచ్‌స్క్రీన్, మరిన్ని టెక్నికల్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. మహీంద్రా థార్ ఇ కారులో థార్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు. అనేక పార్ట్స్ కూడా చేంజ్ చేశారు.

6 / 6
థార్ - ఇ ఇప్పట్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం లేదు. అయితే, 2027లోగానీ అంతకంటే ముందుగా గానీ తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక ఈ కారు కనీసం 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని పొందే అవకాశం ఉంది.