Lay Offs: కొత్త ఏడాదిలో ప్రారంభమైన లే‎ఆఫ్‎ల పర్వం.. ఈ కంపెనీ ఉద్యోగులకు నోటీసులు

|

Jan 15, 2024 | 12:00 PM

ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను క్రమంగా కోతకు గురిచేస్తోంది. ప్రస్తుతం వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం లే ఆఫ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన టెక్కీలకు ఈ ఏడాది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభమై పట్టుమని 15 రోజులు కూడా కాలేదు.

Lay Offs: కొత్త ఏడాదిలో ప్రారంభమైన లే‎ఆఫ్‎ల పర్వం.. ఈ కంపెనీ ఉద్యోగులకు నోటీసులు
Layoffs In Google
Follow us on

ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను క్రమంగా కోతకు గురిచేస్తోంది. ప్రస్తుతం వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం లే ఆఫ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన టెక్కీలకు ఈ ఏడాది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభమై పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. అప్పుడు గూగుల్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగుల గుండెల్లో గుపులు పుట్టిస్తోంది. ఎందరికి పింక్ స్లిప్ ఇచ్చిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పనప్పటికీ ఏన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బందిని తొలగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇలా వివిధ విభాగాల్లో పనిచేసే వారిలో 19 ఏళ్లుగా కంపెనీని విడువకుండా సేవలందించిన వారి పేర్లు ఉండటం గమనార్హం.

కెవిన్ బౌర్డి్ల్లాన్ అనే సిబ్బందికి బుధవారం రాత్రి నిన్ను విధుల నుంచి తొలగిస్తు్న్నట్లు గూగుల్ చెప్పిందని పేర్కొన్నారు. అయితే దీనిపట్ల కొంత విచారం వ్యక్తం చేసినప్పటికీ తిరిగి రీస్టార్ట్ అయ్యారు సదరు ఉద్యోగి. గూగుల్ లో ఉద్యోగం పోవడం కాస్త అసౌకర్యానికి గురి చేసినప్పటికీ.. కుటుంబంతో కొంత కాలం గడిపేందుకు, ఒంటరిగా సేదతీరేందుకు సమయం లభించిందని సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ (ట్విట్లర్)‎లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే గూగుల్ సంస్థ ప్రకటనతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు కూడా తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ కోవలోకి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం సైతం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పింక్ కార్డ్ జారీ చేయడం పలువురికి ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

‘గూగుల్ నన్ను తొలగించినందుకు నేను బాధపడటం లేదని, ఇలా జరగడం ఒకందుకు మంచే జరిగిందని పేర్కొన్నాడు. ఎందుకంటే తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు కొంత వెసులుబాడు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అన్నది ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ప్రస్తుతం తనకు నచ్చిన అంశాలపై ఆలోచిస్తున్న’ట్లు వెల్లడించారు.

కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే కాకుండా సోషల్ మీడియా సంస్థలపై కూడా లే ఆఫ్ ల ప్రభావం పడుతోంది. సోషల్ పోస్ట్, మెసేజింగ్ వంటి సంస్థలు కూడా తమ మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. మొన్న సిటీ బ్యాంక్ సంస్థ కూడా తమ సంస్థ నుంచి 20 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏది ఏమైనా 2023 పరంపర ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభం కావడం టెక్కీలకు మరింత గడ్డు కాలంగా చెప్పక తప్పడం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..