KPI Green Energy: భారీగా పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం

సౌరశక్తి సంస్థ సోలార్ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు గురువారం దూసుకుపోయాయి. ఈ కంపెనీ షేర్లలో 5 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌లో రూ.1,014.2 వద్దకు చేరాయి. ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ అంతకు ముందు రోజు విడుదల చేసింది. త్రైమాసికంలో కేపీఐ

KPI Green Energy: భారీగా పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం
Kpi Green Energy
Follow us

|

Updated on: Aug 09, 2024 | 6:36 PM

సౌరశక్తి సంస్థ సోలార్ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు గురువారం దూసుకుపోయాయి. ఈ కంపెనీ షేర్లలో 5 శాతం పెరిగి అప్పర్‌ సర్క్యూట్‌లో రూ.1,014.2 వద్దకు చేరాయి. ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ అంతకు ముందు రోజు విడుదల చేసింది. త్రైమాసికంలో కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన దాదాపు రెండింతలు పెరిగి రూ.66.11 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.33.26 కోట్లు. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.349.85 కోట్లకు పెరిగిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.190.56 కోట్లుగా ఉందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఉదయం బీఎస్‌ఈ 969 రూపాయల వద్ద లాభాలతో ప్రారంభమయ్యాయి. రోజులో ఇది మునుపటి ముగింపు ధర నుండి 5 శాతం జంప్ చేసి, గరిష్టంగా రూ. 1013.35 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12200 కోట్లు. జూలై 18, 2024 వరకు కంపెనీలో ప్రమోటర్లు 53.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత ఏడాది కాలంలో షేరు ధర దాదాపు 280 శాతం పెరిగింది.

గత 4 ఏళ్లలో ఈ స్టాక్ 12109 శాతం రాబడిని ఇచ్చింది. ఆగస్టు 7, 2020న బీఎస్‌ఈలో కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేరు ధర రూ. 8.3. ఎవరైనా 4 సంవత్సరాల క్రితం ఈ ధరకు షేర్లలో రూ.50,000 ఇన్వెస్ట్ చేసి, ఇంకా ఆ షేర్లను విక్రయించకపోతే, నేటికి అతని పెట్టుబడి రూ.61 లక్షలు అవుతుంది. లక్ష రూపాయల పెట్టుబడి 1.22 కోట్ల రూపాయలుగా మారేది.

ఇవి కూడా చదవండి

కేపీఐ గ్రీన్ ఎనర్జీ బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ఫేస్ వ్యాల్యూవ్ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.20 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీని రికార్డు తేదీ 21 ఆగస్టు 2024. కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో లేదా డిపాజిటరీల రికార్డులలో ఈ తేదీ నాటికి షేర్ల లాభదాయకమైన యజమానులుగా ఉన్న షేర్‌హోల్డర్‌లు డివిడెండ్‌ను స్వీకరించడానికి అర్హులు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.5 ఫేస్‌ వ్యాల్యూవ్‌తో 4 శాతం లేదా రూ.0.2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించి, ప్రకటించారని కంపెనీ ప్రకటించింది. ఈ మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి రికార్డు తేదీ ఆగస్టు 21. డివిడెండ్ డిక్లరేషన్ తేదీ నుండి 30 రోజులలోపు సభ్యుల రిజిష్టర్‌లో పేర్లు ఉన్న షేర్‌హోల్డర్‌లకు రికార్డ్ తేదీ నాటికి డివిడెండ్ చెల్లించబడుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇమ్యూనిటీని పెంచే జాపత్రి.. వర్షా కాలంలో తినడం బెస్ట్..
ఇమ్యూనిటీని పెంచే జాపత్రి.. వర్షా కాలంలో తినడం బెస్ట్..
కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!ఎక్కడ కనిపించినావదలకండి
కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!ఎక్కడ కనిపించినావదలకండి
దిగ్గజ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్‌ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హాకీ ఇండియా
దిగ్గజ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్‌ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హాకీ ఇండియా
ప్రకాశం జిల్లాలో మూడు రంగుల అరుదైన పక్షి ప్రత్యక్షం..
ప్రకాశం జిల్లాలో మూడు రంగుల అరుదైన పక్షి ప్రత్యక్షం..
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..
నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..
ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్
ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్
పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం
పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..