వ్యక్తిగత రుణం ప్రీ క్లోజర్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనుమతిస్తాయి. అయితే వాటిపై కొంత పెనాల్టీలు వసూలు చేస్తాయి.
కొన్ని బ్యాంకులు నిర్ణీత కాలం తర్వాత క్లోజర్‌కు అనుమతిస్తాయి. అందుకే లోన్ తీసుకునే ముందే ప్రీ క్లోజర్ గురించి తెలుసుకోవాలి.
ప్రీ క్లోజర్‌తో పాటు పార్షియల్ పేమెంట్(పాక్షిక పేమెంట్) ఆప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే అది అన్ని బ్యాంకుల్లో ఉండదు.
వినియోగదారులకు చాలా ప్రయోజనకరగంగా ఉంటుంది. అయితే దీనిపై కూడా పెనాల్టీలు ఉండే అవకాశం ఉంది. బ్యాంకుల్లో ముందుగానే దీని గురించి అడగాలి.
పర్సనల్ లోన్ ను ముందస్తుగా ముగించాలనుకున్నప్పుడు దానిపై పెనాల్టీ గురించి ఆలోచించాలి. సాధారణంగా దీనికి 5శాతం వరకూ పెనాల్టీ పడుతుంది.
ఇది బ్యాంకును బట్టి.. మీరు తిరిగి చెల్లిస్తున్న కాలాన్ని బట్టి మారుతుంటుంది. అంతే ఎంత ముందుగా చెల్లింపు చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణ.. మీరు లోన్ తీసుకున్నాక 13 నుంచి 24 నెలల మధ్య ప్రీ క్లోజర్ చేయాలనుకుంటే 4శాతం, 25 నుంచి 36 నెలల మధ్య ప్రీ క్లోజ్ చేయాలనుకుంటే
3శాతం, 36 నెలల తర్వాత అయితే 2శాతం పెనాల్టీని అప్పటికి ఉన్న అసలుపై బ్యాంకులు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
పర్సనల్ లోన్ ప్రీ క్లోజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం.. దాని కాల పరిమితి. లోన్ తీసుకున్న మొదటి దశలోనే దానిని ప్రీ క్లోజ్ చేసుకోవడం ఉత్తమం.
లోన్ చివరి దశకు వచ్చినప్పుడు ప్రీ క్లోజ్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ముందుగా చేస్తే వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ చివరిలో చేస్తే వడ్డీ పెద్దగా తగ్గదు.