రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి సరికొత్త బైక్‌-ధర ఎంతో తెలుసా? మూహూర్తం ఖరారు

05 August 2024

Subhash

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మోటర్ సైకిల్ యూజర్లకు అప్ డేటెడ్ వర్షన్ మోటార్ బైక్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)’ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 

ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 350సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ నూతన ఫీచర్లు, కలర్ స్కీమ్స్‌లో వస్తోంది.

ఈ నెల 12న

ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్‌తోపాటు స్టాండర్డ్ న్యూ ఎల్ఈడీ హెడ్ లైట్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తున్నదని భావిస్తున్నారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్

న్యూ కలర్స్ గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ మోటరు సైకిల్ లో డ్యుయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్లు, సింగిల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్లు.

డ్యుయల్ చానెల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ 349సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ జే సిరీస్ ఇంజిన్ తో వస్తుందని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 

ఈ ఇంజిన్ గరిష్టంగా 6100 ఆర్పీఎం వద్ద 20.21 పీఎస్, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అలాగే 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుందని చెబుతున్నారు.

ఇంజిన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, అనలాగ్ స్పీడో మీటర్, స్మాల్ ఎల్‌సీడీ స్క్రీన్ మీద ఒడో మీటర్, ఫ్యుయల్ లెవల్స్, ట్రిప్ మీటర్స్ గురించి సంకేతాలు.

రాయల్ ఎన్‌ఫీల్డ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ ఇంట్రడ్యూసరీ ధర రూ.1,93,080 – 2,24,755 (ఎక్స్ షోరూమ్). అప్ డేటెడ్ బైక్ ధర తదుపరి రూ.3000-4000 పెరుగుతుందని చెబుతున్నారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్