UPI Payments: వావ్.. కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు.. ఒకే ఒక్క మాట చెబితే చాలు..

రిలయన్స్ జియో సరికొత్త AI గ్లాసెస్‌ను ప్రదర్శించింది. వీటితో QR కోడ్‌లను స్కాన్ చేసి వాయిస్ కమాండ్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు. ఈ గ్లాసెస్ 12 భాషల్లో లైవ్ అనువాదం చేస్తుంది. అలాగే అనేక అధునాతన ఫీచర్లను కూడా అందిస్తుంది.

UPI Payments: వావ్.. కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు.. ఒకే ఒక్క మాట చెబితే చాలు..
Upi Payments

Updated on: Oct 10, 2026 | 1:39 PM

రిలయన్స్ జియో సరికొత్త AI గ్లాసెస్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 (IMC 2026)లో ప్రదర్శించింది. ఢిల్లీలోని యశోభూమిలో అక్టోబర్ 7 నుండి 10 వరకు ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో జియో కొత్త ఏఐ గ్లాసెస్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏఐ గ్లాసెస్ పేరు జియోఫ్రేమ్స్. ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫ్రేమ్‌లో చిన్న కెమెరా అమర్చబడి ఉంటుంది. వినియోగదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దీని ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. మీరు ఫోన్ ఇంట్లో మార్చిపోయినా లేదా మీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, మీ ఫోన్‌లో యూపీఐ యాప్స్ పనిచేయని పక్షంలో ఈ గ్లాసెస్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తుంది. ఇదెలా పనిచేస్తుందనేది ఇప్పుడు చూద్దాం.

హాయ్ జియో అని చెబితే చాలు..

మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్ వైపు చూసి “Hello Jio” అని పలకడం ద్వారా వాయిస్ కమాండ్‌లతో UPI చెల్లింపులు చేయవచ్చు. ఉదాహరణకు మీరు వాయిస్ కమాండ్ ద్వారా రూ.4 వేలు పే చేయి అని చెబితే.. అది నిర్ధారణ అడిగుతుంది. మీరు ఆమోదించిన వెంటనే UPI ద్వారా డబ్బు బదిలీ అవుతుంది. జియోరియాలిటీఓఎస్ (JioRealityOS) ఆధారంగా పనిచేసే ఈ జియోఫ్రేమ్స్ అనేక ఫీచర్లు కలిగి ఉంది. ఇందులో 12 భారతీయ భాషలలో లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉంది. ఇది 15 నిమిషాల వరకు సమావేశాలను రికార్డ్ చేసి.. వాటి సారాంశాన్ని కూడా అందిస్తుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జియో ఆడియో ఫ్రేమ్స్ (Jio Audio Frames), జియోబడ్స్ (JioBuds) వంటి ఇతర పరికరాలను కూడా జియో ప్రదర్శించింది. అయితే ఈ జియోఫ్రేమ్స్ డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది.

పేమెంట్ లిమిట్ ఎంత..?

అయితే ఈ ఫ్రేమ్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయలేం. యూపీఐ సర్కిల్ ద్వారా ఒక్కొ లావాదేవీకి గరిష్టంగా రూ.5 వేల వరకు పేమెంట్ చేయవచ్చు. దీని నెలవారీ పరిమితి రూ.15 వేలుగా ఉంది. అయితే ఈ ఏఐ గ్లాసెస్ ద్వారా ఎంతవరకు నగదును యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చనేది జియో ఇంకా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ ఫీచర్ ద్వారా మీ జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి అన్ లాక్ చేయడం, క్యూఆర్ కోడ్ చేయడం, పేమెంట్ యాప్ యాప్ తెరవడం లాంటి పనులు తప్పుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us