IPO: ఈ సంవత్సరంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్ ఇష్యూలకు రావడానికి సిద్ధంగా ఉన్న 24 కంపెనీలు..

2022లో కూడా భారీగానే ఐపీవోలు రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ పెద్ద ఎత్తున పబ్లిక్ ఇష్యూలు రానున్నట్లు పలు మర్చంట్‌ బ్యాంకర్లు వెల్లడించాయి.

IPO: ఈ సంవత్సరంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్ ఇష్యూలకు రావడానికి సిద్ధంగా ఉన్న 24 కంపెనీలు..
Ipo
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 03, 2022 | 10:09 AM

2022లో కూడా భారీగానే ఐపీవోలు రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ పెద్ద ఎత్తున పబ్లిక్ ఇష్యూలు రానున్నట్లు పలు మర్చంట్‌ బ్యాంకర్లు వెల్లడించాయి. దాదాపు 24 కంపెనీలు రూ.44,000 కోట్లు సమీకరించనున్నట్లు అంచనా వేశారు. వీటిలో చాలా వరకు టెక్నాలజీ ఆధారిత కంపెనీలేనని తెలుస్తోంది. గత సంవత్సరంలో 63 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి.

రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాయి. ఈ త్రైమాసికంలో హోటల్ అగ్రిగేటర్‌ ఓయో, సప్లయ్‌ చైన్‌ సంస్థ ‘డెలివరీ’ వంటి భారీ ఐపీఓలు రాబోతున్నాయి. వీటితో పాటు అదానీ విల్మర్‌, ఎమ్‌క్యూర్‌ ఫార్మా, వేదాంత్‌ ఫ్యాషన్స్‌, పారాదీప్‌ పాస్ఫేట్స్‌, మేదాంత, ఇక్సిగో వంటి సంస్థలు కూడా పబ్లిక్‌ ఇష్యూకి సిద్ధంగా ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ ఇటీవల కఠినతరం చేసింది. సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం 35 శాతం కేటాయించాలని స్పష్టం చేసింది.

Read Also.. Tata Motors: భారతదేశంలో హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టిన టాటా మోటార్స్‌.. దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా..