India Billionaires: మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?

India Billionaires: మన దేశంలో బిలియనీర్లు నిమిషానికి లక్షల్లో సంపాదిస్తున్నారు. సాధారణ ప్రజలు నెలంతా కష్టపడినా సంపాదించలేని మొత్తాన్ని ఈ బిలియనీర్లు కేవలం ఒక్క నిమిషంలోనే ఆర్జిస్తుండటం గమనార్హం. రోజు రోజుకు వారి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వారి వ్యాపారాలను విస్తరించుకుంటూ..

India Billionaires: మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?
India Billionaires

Updated on: Jul 06, 2026 | 7:12 AM

India Billionaires: భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు తమ నికర ఆస్తుల (Net Worth) విలువతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, ఈ బిలియనీర్లు ప్రతి నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? ఊహకందని రేంజ్‌లో ఉండే వారి వార్షిక ఆదాయం, నిమిషానికి వచ్చే సంపాదన వివరాలు ఇవే:

1. దిలీప్ సంఘ్వీ (Dilip Shanghvi)

సన్ ఫార్మా (Sun Pharma) వ్యవస్థాపకుడైన దిలీప్ సంఘ్వీ ఈ జాబితాలో నిమిషానికి అత్యధిక ఆదాయంతో ముందున్నారు.

  • నికర ఆస్తి విలువ: రూ.2.5 లక్షల కోట్లు
  • వార్షిక ఆదాయం: రూ.27,540 కోట్లు
  • నిమిషానికి సంపాదన: రూ.5.24 లక్షలు

2. ముఖేష్ అంబానీ (Mukesh Ambani)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర ఆస్తుల పరంగా దేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా ఉన్నారు.

  • నికర ఆస్తి విలువ: రూ.8.5 లక్షల కోట్లు
  • వార్షిక ఆదాయం: రూ.26,350 కోట్లు
  • నిమిషానికి సంపాదన: రూ.5 లక్షలు

3. గౌతమ్ అదానీ (Gautam Adani)

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడైన గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది.

  • నికర ఆస్తి విలువ: రూ.5 లక్షల కోట్లు
  • వార్షిక ఆదాయం: రూ.16,150 కోట్లు
  • నిమిషానికి సంపాదన: రూ.3.07 లక్షలు

4. శివ్ నాడార్ (Shiv Nadar)

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సిఎల్ టెక్ (HCL Tech) వ్యవస్థాపకుడైన శివ్ నాడార్ కూడా నిమిషానికి లక్షల్లోనే ఆర్జిస్తున్నారు.

  • నికర ఆస్తి విలువ: రూ.2 లక్షల కోట్లు
  • వార్షిక ఆదాయం: రూ.11,000 కోట్లు
  • నిమిషానికి సంపాదన: రూ.2.1 లక్షలు

5. రాధాకిషన్ దమానీ (Radhakishan Damani)

డీమార్ట్ (D-Mart) సూపర్ మార్కెట్ చైన్ ద్వారా రిటైల్ రంగంలో విప్లవం తెచ్చిన రాధాకిషన్ దమానీ సంపాదన కూడా భారీ స్థాయిలోనే ఉంది.

  • నికర ఆస్తి విలువ: రూ.2 లక్షల కోట్లు
  • వార్షిక ఆదాయం: రూ.10,200 కోట్లు
  • నిమిషానికి సంపాదన: రూ.2 లక్షలు

సాధారణ ప్రజలు నెలంతా కష్టపడినా సంపాదించలేని మొత్తాన్ని ఈ బిలియనీర్లు కేవలం ఒక్క నిమిషంలోనే ఆర్జిస్తుండటం గమనార్హం. అయితే వీరి వ్యాపారాలు విస్తరిస్తున్నకొద్ది సంపాదన పెరుగుతుంటుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us