Hyundai Car Offers: లక్కీ చాన్స్.. ఈ కార్లపై ఏకంగా రూ. 4లక్షల వరకూ తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..

ఇది కేవలం కొత్త కొనుగోలుదారులను తన వైపు తిప్పుకునే ప్రమోషనల్ క్యాంపెయిన్ మాత్రమే కాక ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ యజమానులకు కూడా వారి ఆటోమోటివ్ కలెక్షన్ ను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే ఎక్స్ చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక డైరెక్ట్ క్యాష్ తగ్గింపులు, బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా హ్యూందాయ్ ఐ10 నియోస్, ఆరా, వెర్నా, టక్సన్, వెన్యూ, అల్కాజర్, కోన ఈవీ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.

Hyundai Car Offers: లక్కీ చాన్స్.. ఈ కార్లపై ఏకంగా రూ. 4లక్షల వరకూ తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
Hyundai Cars

Updated on: Feb 07, 2024 | 8:56 AM

దిగ్గజ కార్ల కంపెనీ హ్యూందాయ్ 2024 ఫిబ్రవరిలో తన కార్ల విక్రయాలకు కిక్ స్టార్ట్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకే పలు మోడళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లపై అదిరిపోయే తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇది కేవలం కొత్త కొనుగోలుదారులను తన వైపు తిప్పుకునే ప్రమోషనల్ క్యాంపెయిన్ మాత్రమే కాక ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ యజమానులకు కూడా వారి ఆటోమోటివ్ కలెక్షన్ ను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే ఎక్స్ చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక డైరెక్ట్ క్యాష్ తగ్గింపులు, బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా హ్యూందాయ్ ఐ10 నియోస్, ఆరా, వెర్నా, టక్సన్, వెన్యూ, అల్కాజర్, కోన ఈవీ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హ్యూందాయ్ ఐ10 నియోస్..

ఈ కారుపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐ10 నియోస్ సీఎన్జీ వేరియంట్ పై రూ. 43,000పైగా డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 30,000 కాగా, మరో రూ. 10,000 ఎక్స్ చేంజ్ బోనస్, అదనంగా మరో రూ. 3000 ప్రత్యేక ఆఫర్ వస్తుంది. ఐ10 నియోస్ స్టాండర్డ్ వేరియంట్ తో పాటు ఐ10 నియోస్ ఏఎంటీ వేరియంట్లపై వరుసగా రూ. 28,000, రూ. 18,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయి.

హ్యూందాయ్ ఆరా, వెర్నా..

సెడాన్ క్లాస్ కు చెందిన ఈ రెండు కార్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. ఆరా సీఎన్జీ వెర్షన్ పై రూ. 33,000 వివిధ రకాల ప్రయోజనాలు అందుతాయి. ఇక ఆరా స్టాండర్డ్ వెర్షన్ పై రూ. 18,000 తగ్గింపును పొదొచ్చు. ఇక వెర్నా విషయానికి వస్తే అన్ని నగదు తగ్గింపులు, ఎక్స్ చేంజ్ బోనస్ లు కలిపి రూ. 35,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లు హ్యుందాయ్ సెడాన్‌లను ప్రాక్టికాలిటీ, స్టైల్ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ కొనుగోలుదారులకు అగ్ర ఎంపికగా మారాయి.

హ్యూందాయ్ టక్సన్, వెన్యూ, అల్కాజార్ ఎస్‌యూవీ..

ఎస్‌యూవీ ఔత్సాహికులకు ఇష్టమైన టక్సన్ డీజిల్ వేరియంట్‌పై మొత్తం రూ. 50,000 ప్రయోజనాన్ని హ్యూందాయ్ అందిస్తోంది. అధిక శక్తి, పనితీరు కోసం వెతుకుతున్న వారిని ఇది ఆకట్టుకుంటుంది. అలాగే టక్సన్ పెట్రోల్ వెర్షన్ పై కూడా ఆకట్టుకునే రూ. 4,00,000 నగదు తగ్గింపును ఇస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో తగ్గింపు ఇవ్వడం ఎస్‌యూవీ కార్ల విభాగంలో ఇది తొలిసారి. వెన్యూ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ, దాని డీసీటీ, టర్బో ఎంటీ వేరియంట్‌లు, విలాసవంతమైన అల్కాజార్ రెండూ మొత్తం రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ప్రయోజనాలను పొందాయి.

హ్యూందాయ్ కోన ఈవీ..

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హ్యూందాయ్ కోనా ఈవీపై ఏకంగా రూ. 4,00,000 నగదు తగ్గింపుతో అందరూ తనవైపు చూసేలా చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్య విద్యుత్ విప్లవానికి నాయకత్వం వహించడంలో హ్యుందాయ్ నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది.

సువర్ణావకాశం..

ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు కొనుగోలుదారులకు సువర్ణావాకాశన్ని అందిస్తున్నాయి. హ్యుందాయ్ ఈ ప్రత్యేకమైన తగ్గింపులు ఫిబ్రవరి నెలంతా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఆలస్యం లేకుండా సమీప హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..