Hyundai Car: అదిరిపోయే ఆఫర్.. రూ. 11 లక్షల హ్యుందాయ్ క్రెటా.. కేవలం రూ. 7 లక్షలకే! మీరూ లుక్కేయండి..

కొత్త కారు కొనుగోలు చేయాలంటే.. చాలామందికి బడ్జెట్ సరిపోదు. అందుకే బెస్ట్ డీల్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు...

Hyundai Car: అదిరిపోయే ఆఫర్.. రూ. 11 లక్షల హ్యుందాయ్ క్రెటా.. కేవలం రూ. 7 లక్షలకే! మీరూ లుక్కేయండి..
Hyundai Creta

Updated on: Mar 04, 2023 | 1:00 PM

కొత్త కారు కొనుగోలు చేయాలంటే.. చాలామందికి బడ్జెట్ సరిపోదు. అందుకే బెస్ట్ డీల్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చాం. రూ. 11 లక్షల 80 వేల (ఎక్స్-షోరూమ్) విలువైన హ్యుందాయ్ క్రెటాను కేవలం రూ. 7 లక్షల 46 వేలకు ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ సెకండ్ హ్యాండ్ కారును ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ స్పిన్నీ(Spinny) అమ్మకానికి ఉంచింది. దీనిని మొదటి యజమాని విక్రయిస్తుండగా.. ఈ వాహనం ఇప్పటివరకు 84 వేల 387 కిలోమీటర్లు నడిచింది. అలాగే ఈ కారును మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పొందొచ్చు. జూలై 2016లో రిజిస్ట్రేషన్ అయిన ఈ హ్యుందాయ్ క్రెటా పెట్రోల్‌తో నడిస్తుంది. అలాగే దీనికి మార్చి 2024 వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది.

MH02 నంబర్ ప్లేట్‌తో ఈ కారు ముంబైలోని దాదర్ ప్రాంతంలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కారును స్పిన్నీలో రూ.7.46 లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్‌కు ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.

 

Loading...
Unable to load recommendations.
Follow Us