ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం విద్యుత్ శ్రేణి వాహనాల తయారీపై దృష్టి పెట్టింది. మిగిలిన పోటీ దారులతో పోల్చితే కాస్త వెనుకబడిన వచ్చే సంవత్సరాలలో ఆ లోటును అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది 2024లో హొండా నుంచి రెండు ఎలక్ట్రిక్ వేరియంట్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు రానున్నాయి. వాటిల్లో ఎంతో కాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉండనుంది. ఈ మేరకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ మ్యాప్ ను ప్రకటించింది. 2024 పూర్తయ్యే నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు స్వాపబుల్ బ్యాటరీ సదుపాయాన్ని కూడా తీసుకురానున్నట్లు పేర్కొంది. అలాగే 2030 కల్లా 10లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. దీనిని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హోండా నుంచి ముందుగా రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మిడ్ రేంజ్‍లోనే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా యాక్టివా ఎలక్ట్రిక్‍ను హోండా తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ స్కూటర్ విభాగంలో అమ్మకాల పరంగా హోండా యాక్టివా టాప్‍లో ఉంది. అందుకే యాక్టివా పేరుతోనే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది అందుబాటు ధరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫిక్స్డ్ బ్యాటరీతోనే రావొచ్చు. యాక్టివా తర్వాత స్వాపబుల్ బ్యాటరీ సదుపాయంతో మరో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను హోండా తీసుకొస్తుందని సమాచారం. ఇది హోండా ఈఎం1ఈ అయ్యే ఛాన్స్ ఉంది. స్వాపబుల్ సదుపాయం ఉంటే.. చార్జ్ అయిపోయిన బ్యాటరీని బయటికి తీసి.. దాన్ని చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే సపోర్ట్ చేసే వేరే బ్యాటరీని కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ప్లాట్‍ఫామ్‍పై ఎలక్ట్రిక్ టూ-వీలర్లను హోండా తయారు చేయనుంది. దీనికి ‘ప్లాట్‍ఫామ్ ఈ’ అనే పేరు పెట్టింది.
కర్ణాటకలోని నర్సాపుర ప్లాంట్‍లో 2030 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు కావాల్సిన బ్యాటరీలను, పవర్ కంట్రోల్ యూనిట్లను దేశీయ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని హోండా భావిస్తోంది. భారత మార్కెట్‍లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లను కర్ణాటకలోని నర్సాపూర ప్లాంట్‍లో తయారు చేయనున్నట్టు హోండా పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లకు కూడా ఎగుమతులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. అలాగే బ్యాటరీల చార్జింగ్ కోసం దేశవ్యాప్తంగా 6,000 టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..