Today Gold price: ఈ రోజు బంగారం ధర ఎలా ఉందో తెలుసా.? తులం ఎంతంటే..

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి మళ్లీ రెక్కలొస్తున్నాయి. మొన్నటి వరకు తులం బంగారం ధర రూ. 70 వేలలోపు తగ్గి అందరికీ ఉపశమనం కల్పించింది. అయితే మళ్లీ బంగారం ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల మార్క్‌ను దాటేసింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో...

Today Gold price: ఈ రోజు బంగారం ధర ఎలా ఉందో తెలుసా.? తులం ఎంతంటే..
Gold Price Today

Updated on: Aug 25, 2024 | 6:25 AM

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి మళ్లీ రెక్కలొస్తున్నాయి. మొన్నటి వరకు తులం బంగారం ధర రూ. 70 వేలలోపు తగ్గి అందరికీ ఉపశమనం కల్పించింది. అయితే మళ్లీ బంగారం ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల మార్క్‌ను దాటేసింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. మరి తాజాగా బంగారం ధర ఎలా ఉంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది.

* దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 67,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,190 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా,24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది.

* ఇక కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,400గా నమోదైంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధర ఎలా ఉందంటే..

దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీతోపాటు, ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 88,000 వద్ద కొనసాగుతోంది. కాగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంతో పాటు.. చెన్నై, కేరళ వంటి నగరాల్లో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 93,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్నిబిజినెస్  వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us