
బంగారం కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. శుక్రవారం ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదల తీవ్ర నిరాశను కల్గిస్తోందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారతాయి. కొనుగోలు చేసేటప్పుడు ప్రాంతాలు, స్థానిక పన్నులను బట్టి ధరలను పరిశీలించాలి. నవంబర్ 27న ధరలు భారీగా పెరిగాయి. లెటెస్ట్ ధరల గురించి తెలుసుకుందాం

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,550కు పెరగ్గా.. ఇవాళ ఒక్కరోజే రూ.1,750 మేర పుంజుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.1.16 లక్షలకు చేరుకోగా.. శుక్రవారం ఒక్కరోజులోనే రూ.1600 ఎగబాకాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ౌఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,600 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1650 మేర పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,16,150 వద్ద ట్రేడవుతోండగా.. నేడు ఒక్కరోజే రూ.1600 మేర పెరిగాయి. చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతూ వస్తోన్నాయి.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా షాకిచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1.65 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.5 వేలు పెరిగాయి. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

ఃకాగా కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో నవంబర్ 27న ప్రారంభ ట్రేడింగ్‌లో విలువైన లోహాలు అధిక ధరలకు ట్రేడ్ అయ్యాయి. డిసెంబర్ 4 డెలివరీకి సంబంధించిన దేశీయ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,24,125 వద్ద పెరిగాయి. ఇవి 1.52 శాతం పెరుగుదలతో సెషన్‌ను ప్రారంభించాయి. అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి రూ. 1,51,704 వద్ద 4.02 శాతం స్వల్పంగా పెరిగింది. ఈ వారంలో ధరలు