Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. సాధారణంగా వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price

Updated on: Sep 28, 2023 | 6:27 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. సాధారణంగా వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే వీటి ధరలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.600 మేర తగ్గి.. రూ.74,200 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,500, 24 క్యారెట్ల పసిడి రూ.59,450, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450, బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,450 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,200 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,200 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.74,200 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,000, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us