Gold Prices: మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారికి షాక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. రోజురోజుకు పెరుగుతూ కొనుగోలు చేసేవారికి షాకిస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. ఈ నెలలో మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నేడు వివిధ నగరాల్లో ఇలా..

Gold Prices: మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారికి షాక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Aug 13, 2026 | 7:16 AM

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా గోల్డ్ రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఈ క్రమంలో బంగారం ధరలు పెరగడం బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం సేల్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో గోల్డ్ ధరలు పెరిగి నిరాశపరుస్తున్నాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయి దిశగా పసిడి పరుగులు పెడుతోంది. డాలర్ విలువలో హెచ్చుతగ్గులతో పాటు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లతో అనిశ్చితి, ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆగస్ట్ 13వ తేదీన దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,870కు చేరుకోగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,960 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,54,870 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు చూస్తే రూ.1,41,960గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

-చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,920 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,010గా ఉంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,870గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,960 వద్ద కొనసాగుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,020 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,110గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

-వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో నిన్న కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉండగా.. నేడు రూ.2,54,900కి చేరుకుంది.

-హైదరాబాద్‌లో కూడా సిల్వర్ ధర పడిపోయింది. బుధవారం రూ.2.60 లక్షలుగా ఉండగా.. గురువారం నాటికి రూ.2,59,900గా ఉంది.

-చెన్నైలో ఆగస్ట్ 12న కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నేడు రూ.2,59,900కి చేరుకుంది.

-బెంగళూరులో బుధవారం రూ.2.50 లక్షలుగా ఉండగా.. ఆగస్ట్ 13న రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us