Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?

Gold Price Today: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం..

Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?

Updated on: Jun 27, 2025 | 10:03 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా జూన్‌ 27వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,020 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర కూడా అతి స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 7,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల ధర 89,850 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,020 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,850 వద్ద ఉంది.

బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గి రావడమే అసలు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన అనంతరం బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఈ ప్రభావం కూడా బంగారంపై గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పుంజుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట అని చెప్పవచ్చు.

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే విషయం. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ మార్కెట్లలో కూడా సందడి ఉంది. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us