Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు.. తులం ధర లక్షకు చేరువలో..

Gold Price Today: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఒక లక్షా 8 వేల, 800 పలుకుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి..

Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు.. తులం ధర లక్షకు చేరువలో..

Updated on: Jun 13, 2025 | 6:11 AM

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం లక్ష రూపాయలను ఢీకొట్టిన బంగారం ధర ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి లక్ష దాటేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానముంది. జూన్‌ 13న దేశీయంగా తులం బంగారం ధర 99,290 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో పక్క వెండి కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఒక లక్షా 8 వేల, 800 పలుకుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,160 రూపాయల వద్ద కొనసాగుతుంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద ఉంది.
  5. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి