Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఓరోజు పెరిగితే, మరోరోజు తగ్గుతుంటాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 870 మేరకు పెరిగింది. దీంతో శనివారం 24 క్యారెట్ల బంగారం దర రూ. 78,990కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 800కి పైగా పెరిగి రూ. 72,410లకు చేరుకుంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price
Image Credit source: Getty Images

Updated on: Oct 19, 2024 | 6:32 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు వరుసగా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 870 మేరకు పెరిగి రూ. 78,990కి చేరింది. అటు 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 800కి పైగా పెరిగి రూ. 72,410గా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దేశంలోని వివిధ నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,560గా ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,140కి ఎగబాకింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,410 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 78,9920 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,410కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,990గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,990 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే.. వెండి ధరలోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా శనివారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 99,100కి చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,05,100గా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,05,100గా ఉంది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us