Gold Price Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..?

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. సాధారణంగా వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Gold Price Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..?
Gold Price Today

Updated on: Sep 27, 2023 | 6:25 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. సాధారణంగా వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బంగారం వెండి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,730 లుగా కొనసాగుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.220 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ. 1000 మేర తగ్గి.. రూ.74,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,880 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.54,750, 24 క్యారెట్లు రూ.59,730, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల బంగారం రూ.59,730, బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,730 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,730, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,750, 24 క్యారెట్ల ధర రూ.59,7300 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,800 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.75,800 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000, బెంగళూరులో రూ.75,000, కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.75,800లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.79,000, విజయవాడలో రూ.79,900, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,000లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us