Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించే వారు కూడా చాలా మంది ఉన్నారని తెలిసిందే. అందుకే బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీదున్నాయి...

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Price Latest

Updated on: Jul 23, 2024 | 6:26 AM

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించే వారు కూడా చాలా మంది ఉన్నారని తెలిసిందే. అందుకే బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీదున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా రూ. లక్షకు చేరుతుందని వార్తలు వచ్చాయి. అయితే బంగారం ధరలు ఇప్పట్లో ఆ స్థాయికి చేరుకునేలా కనిపించడం లేదు. మొన్నటి వరకు రూ. 80 వేల వరకు చేరుకున్న తులం బంగారం ధర తాజాగా కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,840కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,990 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,240 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,440గా నమోదైంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,840గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840గా ఉంది.

వెండి ధరలు..

వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపించింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,400 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 95,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us