Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. సాధారణంగా పసిడి, వెండిని వివాహాలు, శుభకార్యాలు లేదా పండుగలు ఉన్న సమయంలో

Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
Gold Price Today

Updated on: Sep 17, 2023 | 6:07 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. సాధారణంగా పసిడి, వెండిని వివాహాలు, శుభకార్యాలు లేదా పండుగలు ఉన్న సమయంలో మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో ధరలు నమోదవుతున్నాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లు ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,670 గా ఉంది. తాజాగా బంగారంపై రూ.220 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.500 మేర పెరిగి రూ.74,000 లుగా కొనసాగుతోంది. కాగా.. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం ధరలు..

ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,820 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.77,500 ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500, విజయవాడలో 77,500, విశాఖపట్నంలో రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us