Gold Price Today: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24క్యారెట్ల గోల్డ్ ఎంత ఉందంటే..

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. సాధారణంగా పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. వీటి ధరలపై చాలామంది ఆసక్తిచూపుతుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాలు, బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటుంటాయి.

Gold Price Today: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24క్యారెట్ల గోల్డ్ ఎంత ఉందంటే..
Gold Price Today

Updated on: Mar 04, 2024 | 6:26 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. సాధారణంగా పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. వీటి ధరలపై చాలామంది ఆసక్తిచూపుతుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాలు, బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ప్రతీరోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటుంటాయి. ఒక్కోసారి బంగారం, వెండి ధరలు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం (మార్చి 04 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,080 గా ఉంది. వెండి కిలో రూ.73,500 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,890 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,230 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.59,390, 24 క్యారెట్ల ధర రూ.64,790, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 గా ఉంది. ముంబైలో రూ.73,500, చెన్నైలో రూ.76,900, బెంగళూరులో రూ.72,850, కేరళలో రూ.76,900, కోల్‌కతాలో రూ.73,500 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,900, విజయవాడలో రూ.76,900, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us