Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price: ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్లు ప్రకటించడం. యుద్ధం జరుగుతున్నప్పుడు, బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. ఎందుకంటే ఆ సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారు..

Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

Updated on: Jun 28, 2025 | 4:02 PM

దేశంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకుపైగా ఉండగా, క్రమంగా దిగి వస్తోంది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపాయి. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయం.

జూన్‌ 28న సాయంత్రం 3 గంటల సమయానికి దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 600 రూపాయలు తగ్గి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.97,420 ఉంది. అదే 22 క్యారెట్ల ధరపై 550 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.89,300 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,07,800 వద్ద ఉంది.

మెహతా ఎక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ..”ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం తగ్గింది. ప్రపంచ మార్కెట్ల పుంజుకోటంతో పాటు ఇది ప్రధాన కారణం అని అన్నారు.

ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్లు ప్రకటించడం. యుద్ధం జరుగుతున్నప్పుడు, బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. ఎందుకంటే ఆ సమయంలో పెట్టుబడిదారులు భయం, అనిశ్చితి వాతావరణంలో సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారు. అలాంటి సమయాల్లో బంగారం సురక్షితమైన ఎంపిక. కానీ ఈ యుద్ధం ముగిసిన వెంటనే, స్టాక్ మార్కెట్ పుంజుకున్న వెంటనే, పెట్టుబడిదారుల ఆసక్తి బంగారం నుండి స్టాక్‌ల వైపు మళ్లింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us