Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. నెల క్రితం లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత అంతగా దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.. ఈ క్రమంలోనే మంగళవారం తగ్గిన బంగారం ధరలు.. బుధవారం భారీగా పెరిగాయి.

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated on: May 24, 2025 | 10:15 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. నెల క్రితం లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత అంతగా దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.. ఈ క్రమంలోనే మంగళవారం తగ్గిన బంగారం ధరలు.. బుధవారం భారీగా పెరిగాయి.. ఒక్కరోజే పసిడి ధర దాదాపుగా రూ.2400 పెరిగింది. లక్ష మార్కు దాటిన తర్వాత.. నెల వ్యవధిలో ధరలు ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి.. బుధవారం బులియన్ మార్కెట్ ప్రకారం..24 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములపై రూ.2400 మేర ధర పెరిగి రూ.97,420 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 2,200 మేర పెరిగి రూ.89,300 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.100 మేర ధర తగ్గి.. రూ.96,900 లుగా ఉంది.

బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,420గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,300లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,07,900లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,420గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,300లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,07,900లుగా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,570 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్ల ధర రూ.97,420 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్ల రేటు రూ.97,420 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,300, 24 క్యారెట్ల ధర రూ.97,420 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..