Gold Price Today: ఇక కొనడం కష్టమే..! భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Hyderabad, Vijayawada Gold, Silver Rates: బంగారం ధర దూసుకెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర లక్షా 22వేల మార్క్ దాటి సరికొత్త రికార్డును తిరగరాసింది.. మరోవైపు సిల్వర్‌ కూడా తగ్గేదేలే అంటోంది.

Gold Price Today: ఇక కొనడం కష్టమే..! భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Updated on: Oct 08, 2025 | 6:31 AM

Hyderabad, Vijayawada Gold, Silver Rates: బంగారం ధర దూసుకెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర లక్షా 22వేల మార్క్ దాటి సరికొత్త రికార్డును తిరగరాసింది.. మరోవైపు సిల్వర్‌ కూడా తగ్గేదేలే అంటోంది. కిలో వెండి ధర లక్షా 55వేల మార్క్ దాటి రెండు లక్షల రూపాయల వైపు పరుగులు తీస్తోంది. దీంతో బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది కష్టంగా మారింది. అయితే.. పసిడి పరుగులకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు ఊతమిస్తున్నాయి.. US ఫెడ్‌ ఈ నెలలో మళ్లీ వడ్డీరేట్లు తగ్గించవచ్చనే అంచనాలు.. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌.. జపాన్‌లో బాండ్‌ ఈల్డ్స్‌తో బంగారం ధరలు పెరుగుతున్నాయి.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పదిగ్రాముల బంగారంపై రూ.1250 వరకు ధర పెరిగింది. కాగా.. అక్టోబర్ 8 2025.. బుధవారం ఉదయం 6 గంటల వరకు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,22,030 కి చేరింది..

22 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,11,860 కి చేరింది.

వెండి కిలోపై రూ.100 మేర ధర పెరిగి.. 1,57,100కి చేరుకుంది.

తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,22,030 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,11,860 ఉంది. కిలో వెండి రూ.1,67,200 లకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,22,030 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ. 1,11,860 ఉంది. కిలో వెండి రూ.1,67,200 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,080, 22 క్యారెట్ల ధర రూ.1,12,010 గా ఉంది.. వెండి కిలో ధర 1,57,100గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర 1,22,030, 22 క్యారెట్ల ధర రూ.1,11,860 గా ఉంది.. వెండి కిలో ధర 1,57,100గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,030, 22 క్యారెట్ల ధర రూ.1,11,860 ఉంది. వెండి కిలో ధర 1,57,100 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,22,190, 22 క్యారెట్ల ధర రూ.1,12,010గా ఉంది. వెండి కిలో ధర 1,66,900 లుగా ఉంది.

కాగా.. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..