Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చినట్లే వచ్చి.. మళ్లీ ఎగబాకుతున్నాయి..

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంత ఉందంటే..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో విధించిన టారిఫ్ సుంకాలు ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నారు.

Updated on: May 08, 2025 | 6:15 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చినట్లే వచ్చి.. మళ్లీ ఎగబాకుతున్నాయి.. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 99వేలకు పైగా ఉంది. మే 08 2025 గురువారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. ధరలు స్వల్పంగా పెరిగాయి.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,760 గా ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.99,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,100లుగా ఉంది. పదిగ్రాముల బంగారంపై రూ.100, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,910, 24 క్యారెట్ల ధర రూ.99,160 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.98,010 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల రేటు రూ.99,010 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,11,100

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,100

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,100

ముంబైలో రూ.99,100

బెంగళూరులో రూ.99,100

చెన్నైలో రూ.1,11,100 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us