
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్న ధరలు.. ఆ తర్వాత దిగివచ్చినట్లే వచ్చి.. మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, అమెరికా యుద్ధం, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో గత ఐదు రోజుల్లో ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. బంగారం వెండి ధరలు కొంతమేర ఊరటనిచ్చాయి.. ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.3,040 తగ్గగా.. వెండి ధర కిలోపై రూ.4,500 మేర తగ్గింది. శనివారం బంగారంపై రూ.600మేర ధర తగ్గింది. ఈ క్రమంలోనే.. మున్ముందు ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (మే 31, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,040 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములు రూ.1,43,950 గా ఉంది.
వెండి కిలోపై రూ.100 మేర పెరిగి.. రూ.2,80,000 గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,040, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,57,040, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,43,950 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,57,190, 22 క్యారెట్ల ధర రూ.1,44,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,80,000 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,040, 22 క్యారెట్ల ధర రూ.1,43,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,80,000 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,59,600, 22 క్యారెట్ల ధర రూ.1,43,630 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,040, 22 క్యారెట్ల ధర రూ.1,43,950 ఉంది. వెండి కిలో ధర రూ.2,80,000 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..