Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం రేటు ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: మార్కెట్‌లో పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు ఎల్లో మెటల్స్.. మరోవైపు క్రూడ్ ఆయిల్ అన్ని అతలాకుతలమవుతున్నాయి..

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం రేటు ఎంత ఉందంటే..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వంటి అంశాల కారణంగా ప్రపంచ ఆర్థిక వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బంగారంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. దీని వల్ల గత సంవత్సరం బంగారం ధర పెరిగింది.

Updated on: Apr 06, 2025 | 6:51 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: మార్కెట్‌లో పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు ఎల్లో మెటల్స్.. మరోవైపు క్రూడ్ ఆయిల్ అన్ని అతలాకుతలమవుతున్నాయి.. స్టాక్ మార్కెెట్ లు భారీగా పతనమయ్యాయి.. ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా తగ్గింది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 06 ఏప్రిల్ 2025 ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.83,100, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.94,000 లుగా ఉంది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,100, 24 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,100, 24 క్యారెట్ల ధర రూ.90,660గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,250, 24 క్యారెట్ల ధర రూ.90,810 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్ల రేటు రూ.90,660 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.83,100, 24 క్యారెట్ల ధర రూ.90,660 గా ఉంది.

వెండి ధరలు..

  • హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,03,000
  • విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,03,000
  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.94,000 లుగా ఉంది.
  • ముంబైలో రూ.94,000గా ఉంది.
  • బెంగళూరులో రూ.94,000
  • చెన్నైలో రూ.1,03,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us