Telugu News Business Gold and Silver Prices Today: Fresh Surge in Gold Rates, Slight Relief in Silver; Check Latest City Wise Prices
Gold Prices Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
బంగారం కొనాలనుకునే వారికి పసిడి ధరలు మళ్లీ షాకిచ్చాయి. గత వారం క్రితం వరకు భారీ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండ్రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ రోజులు తెలుగురాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కొనుగోలు దారులకు బంగారం ధరలు మళ్లీ సాకిచ్చాయి. గత వారం క్రితం వరుసగా తగ్గగుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండ్రోజులుగా మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఉదయంతో పోల్చుకుంటే నేటికి బంగారం ధరల్లో భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కొనుగోలు దారులకు స్వల్ప ఊరటను కల్పించాయి. ప్రస్తుతం దేశ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,300గా మంగళవారం ఉదయం ఈ ధర రూ. 1,42,760 అంటే తులంపై రూ.660 రూపాయల వరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం దేశీక మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,19,900 గా ఉండగా నిన్న ఈ ధర రూ.2,20,000 గా ఉంది. అంటే కేజీ స్వల్పంగా రూ.100 దిగొచ్చింది.
నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,43,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,360గా ట్రేడవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,43,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,360గా ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 4 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,510 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,43,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,360గా ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,43,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,360గా ట్రేడవుతోంది.
వెండి ధరలు ఇలా..
చెన్నైలో కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.2.20 లక్షలుగా ఉంది.
బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది