Gold Prices: బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఉన్నట్లుండి ఒకేసారి పెరిగిన ధరలు.. పెళ్లిళ్ల సీజన్ వేళ దెబ్బ..

Updated on: Feb 19, 2026 | 10:38 AM

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇటీవల కొద్ది రోజుల నుంచి పడిపోతూ వస్తోండగా.. దానికి బ్రేక్ పడింది. గురువారం ఒక్కసారిగా ధరలు ఆమాంతంగా పెరుగుదల నమోదు చేశాయి. ఒకేసారి రూ.2 వేలకుపైగా ధరల పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్. ధరలు తగ్గుదలకు మరోసారి బ్రేక్ పడింది. చాలా రోజుల తర్వాత ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత రెండు, మూడు వారాలుగా ధరలు పతనమవుతూ వస్తోండటంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ గురువారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తున్న క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

2 / 5
గురువారం హైదరాబాద్‌లో బంగారం ధర రూ.2,290 పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,200గా ఉండగా.. ఇవాళ రూ.1,56,490కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు ప్రస్తుతం రూ.1,43,450 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,41,350 వద్ద స్థిరపడింది.

3 / 5
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధర రూ.2940 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల ధర రూ.1,55,240గా ఉండగా.. ఇవాళ రూ.1,58,180 వద్ద కొనసాగుతున్నాయి.  అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,000గా ఉన్నాయి.

4 / 5
అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,490 వద్ద కొనసాగుతున్నాయి. నిన్న ఈ ధర రూ.1,54,200 వద్ద స్థిరపడింది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,43,450గా ఇవాళ ఉండగా.. నిన్న రూ.1,41,350 వద్ద ట్రేడయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.2,290, 22 క్యారెట్లపై రూ.2100 పెరిగాయి.

5 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,640 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,600 వద్ద ఉన్నాయి. అటు వెండి రేటు ఢిల్లీలో రూ.15 వేలు పెరగ్గా.. హైదరాబాద్‌లో రూ.10 వేలు పెరిగింది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2.70 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.60 లక్షల వద్ద కొనసాగాయి.

Follow Us