Gold Rate Today: తగ్గేదేలే.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price in Hyderabad: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు పెరిగి ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. స్వచ్ఛమైన బంగారం ధర 90వేల మార్క్ దాటగా.. కిలో వెండి ధర లక్షా 15వేలకు చేరువైంది.. వాస్తవానికి మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.

Gold Rate Today: తగ్గేదేలే.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

Updated on: Mar 22, 2025 | 6:16 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు పెరిగి ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. స్వచ్ఛమైన బంగారం ధర 90వేల మార్క్ దాటగా.. కిలో వెండి ధర లక్షా 15వేలకు చేరువైంది.. వాస్తవానికి మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. 20 మార్చి 2025 గురువారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,910, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,450 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,05,100 గా ఉంది. 10గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది.

కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,060, 24 క్యారెట్ల ధర రూ.90,600 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల రేటు రూ.90,450 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,14,100

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,14,100

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.105,100 లుగా ఉంది.

ముంబైలో రూ.105,100 గా ఉంది.

బెంగళూరులో రూ.105,100లుగా ఉంది.

చెన్నైలో రూ.1,14,100 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us