Gold Silver Price Today: మళ్లీ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 3) దేశంలో బంగారం (Gold) ధర స్వల్పంగా పెరిగింది . దేశీయంగా పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,480 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,480, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,480 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,310 ఉంది. వెండి ధర తగ్గింది. కిలో వెండి రూ. 800 తగ్గి రూ.66, 800 చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, ముంబైలో రూ.66,800 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,800 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.