Tesla Cars: ఇండియా రోడ్లపై రైట్ హ్యాండ్ మొడల్ టెస్లా కార్లు.. ఎప్పుడంటే..

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ మార్కెట్ భారత్. అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా కార్లు అమ్ముడయ్యే దేశం మనది. ఇందుకోసమే ప్రపంచంలో కార్లు తయారు చేసే కంపెనీలన్నీ ఇండియాలో మార్కెటింగ్‎కు ఉత్సాహం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ డ్రీమ్ కార్‎గా ఉంది టెస్లా.

Tesla Cars: ఇండియా రోడ్లపై రైట్ హ్యాండ్ మొడల్ టెస్లా కార్లు.. ఎప్పుడంటే..
Tesla Cars
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 05, 2024 | 4:07 PM

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ మార్కెట్ భారత్. అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా కార్లు అమ్ముడయ్యే దేశం మనది. ఇందుకోసమే ప్రపంచంలో కార్లు తయారు చేసే కంపెనీలన్నీ ఇండియాలో మార్కెటింగ్‎కు ఉత్సాహం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ డ్రీమ్ కార్‎గా ఉంది టెస్లా. టెస్లా కంపెనీ అధినేత విలన్ మాస్క్ గత కొన్నేళ్లుగా ఇండియాలో టెస్ట్లా కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్లో ఉన్న పన్నులు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లుగా ఇండియాలో టెస్లా కార్లను ప్రవేశపెట్టలేకపోయారు మాస్క్. కానీ ఇక్కడ తయారు చేయకపోయినా జర్మనీలో తయారుచేసి ఎగుమతి చేయాలనేది లేటెస్ట్ ఆలోచనగా కనిపిస్తుంది. ఇందుకోసమే గత కొద్ది నెలలుగా జర్మనీలో ఉన్న టెస్లా ప్లాంట్‎లో రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు. భారత్లో ప్లాంట్ నెలకొల్పడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఆ లోపు ఇండియాలో ఉన్న కొంతమంది బిలినియర్లకైనా టెస్ట్లను ఇంపోర్ట్ చేయాలనేది కంపెనీ ఆలోచన.

ఇందుకోసమే ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉండేలా, ఇండియన్ డ్రైవింగ్‎కి సరిపోయేలా రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు. కానీ అమెరికా, యూకే, జర్మన్ దేశంలో ఉన్నట్లుగా ఆటోడ్రైవ్ ఆప్షన్ ఇండియాలో దిగుమతి చేసే కారులో ఉంటుందా.. ఉండదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. భారత్‎లో దిగుమతి చేయడానికి కంపెనీకి పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో ఈ ఏడాది చివర్లో ఇండియాలోకి టెస్లా ఎంటర్ కానుంది. కానీ ఇండియన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చట్టం ప్రకారం సంవత్సరానికి 8000 కార్లను మాత్రమే పన్నులు కట్టి దిగుమతి చేసే అవకాశం ఉంది. అంతకుమించి పాలసీ ప్రకారం ఇండియాలోకి విదేశాల్లో తయారు చేసిన కార్లను దిగుమతి చేసే అవకాశం లేదు. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్లో తయారు చేస్తున్న ఈ రైట్ హ్యాండ్ కార్లను ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. అయితే టెస్లా‎లో ఉన్న అన్ని మోడల్స్ కాకుండా కేవలం వై మోడల్ మాత్రమే ఇండియాలో ప్రవేశపెట్టన్నారు.

మరోవైపు భారత్‎లో భారీ ప్లాంట్ పెట్టేందుకు కూడా కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు లాంటి ప్రాంతాలను కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే విజిట్ చేశారు. రెండు బిలియన్లు పెట్టుబడితో ప్లాంట్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. మరోవైపు ఇండియాలో ఎలక్ట్రిక్ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతుంది. సాంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల కంటే రెండు శాతం ఎలక్ట్రిక్ కార్ల గ్రోత్ ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా 2030 నాటికి 30% కార్లు ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇండియాలో ప్రవేశిస్తున్న టెస్లా కంపెనీకి కలిసి వచ్చే అంశాలు. మొత్తంగా ఇక్కడ కంపెనీ టెస్టులా ప్లాంట్ ఓపెన్ చేయకముందే కారులను దిగుమతి చేసి అమ్మేందుకు సిద్ధమవుతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ నాటికి ఇండియన్ రోడ్లపై టెస్లా కార్లు దూసుకు వెళ్లబోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles