మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) నియమాలలో ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. కొత్త నిబంధన ప్రకారం.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఆర్థిక సంవత్సరంలో జీపీఎఫ్‌లో రూ.5 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చ. జీపీఎఫ్ అనేది పీపీఎఫ్ లాంటి పథకమే. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉంటారు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ అక్టోబర్ 11, 2022న ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీస్) రూల్స్ 1960 ప్రకారం.. సబ్‌స్క్రైబర్‌కు సంబంధించి జీపీఎఫ్‌లో 6 శాతం కంటే తక్కువ మొత్తం ఉండకూడదు.
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 1960 ప్రకారం.. ఇప్పటి వరకు ఈ ఫండ్‌లో డబ్బు పెట్టడానికి గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ జీతంలో కొంత శాతాన్ని పెట్టుకోవచ్చు. కానీ 15 జూన్ 2022న ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలోపు జీపీఎఫ్ ఖాతాకు జోడించలేమని సమాచారం అందించింది.
పీపీఎఫ్ లాగానే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని అందులో డిపాజిట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో కనీసం 6 శాతాన్ని ఇందులో పెట్టాలి. పదవీ విరమణ సమయంలో ఈ డబ్బు ఖాతాదారునికి తిరిగి వస్తుంది. మీరు జీపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన డబ్బుపై వడ్డీని కూడా పొందుతారు. ప్రస్తుతం జీపీఎఫ్‌పై ఖాతాదారులకు ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది పింఛనుదారుల సంక్షేమ శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడుతుంది.
జీపీఎఫ్ అనేది కూడా ఒక రకమైన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా. ఇది ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండదు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే జీపీఎఫ్ ప్రయోజనం పొందుతారు. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని జీపీఎఫ్‌కు జమ చేయాలి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సహకరించాలి. దీని తరువాత ఉద్యోగ కాలంలో జీపీఎఫ్ సహకారంలో ఉద్యోగి జమ చేసిన మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చెల్లించబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో జీపీఎఫ్ వడ్డీ రేటును మారుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..