Gautam Adani: ఇండియాలో లంచం ఇస్తే, యూఎస్‌లో కేసేంటి? గౌతమ్‌ అదానీని అరెస్ట్‌ చేస్తారా?

బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది, మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న వార్త వచ్చినప్పుడు అదానీ స్టాక్స్‌ పెరిగాయి. అదానీ కంపెనీపై ఒక్క మరక పడగానే.. దలాల్‌స్ట్రీల్‌ షేక్‌ అవుతుంది, స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతాయి.

Gautam Adani: ఇండియాలో లంచం ఇస్తే, యూఎస్‌లో కేసేంటి? గౌతమ్‌ అదానీని అరెస్ట్‌ చేస్తారా?

Updated on: Nov 21, 2024 | 9:30 PM

బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది, మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న వార్త వచ్చినప్పుడు అదానీ స్టాక్స్‌ పెరిగాయి. అదానీ కంపెనీపై ఒక్క మరక పడగానే.. దలాల్‌స్ట్రీల్‌ షేక్‌ అవుతుంది, స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతాయి. అదానీ ఏ రాష్ట్రంతోనైనా వ్యాపార ఒప్పందం చేసుకుంటే.. ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. కాని, అదానీని విమర్శించే రాష్ట్రాలే మళ్లీ అదానీ పెట్టుబడులను కోరుకుంటుంటాయి. ‘అదానీ.. అదానీ.. అదానీ’. బహుశా ఇంత చిత్రవిచిత్ర పరిస్థితి మనదగ్గరే ఉంటుందేమో. భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ రంగంతో దాదాపుగా విడదీయలేని పేరు.. ఈ ‘అదానీ’. ప్రస్తుతం అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు ఫైల్‌ అయింది. అలాంటి ఇలాంటి కేసు కాదు. చాలా సీరియస్‌ కేసు. ఎందుకో తెలుసా. ‘లంచం’ ఇచ్చారని. అయినా.. ఇక్కడ చాలా మందికి అర్థం కాని మ్యాటర్‌ ఏంటంటే.. ‘ఇండియాలో అధికారులకు లంచం ఆఫర్‌ చేస్తే, అమెరికాలో కేసు ఎందుకు ఫైల్‌ అయింది’..? ఏకంగా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్- FBI ఎందుకని ఎంటర్‌ అయింది..? ఇదీ ఇంట్రస్టింగ్ క్వశ్చన్. అదానీ కంపెనీ లంచం ఇచ్చిందా ఇవ్వలేదా? ఇస్తే ఏ రాష్ట్రంలో, ఎవరెవరికి, ఎంతెంత ఇచ్చారు? అమెరికా దగ్గర ఈ వివరాలన్నీ ఉన్నాయ్.. విత్‌ ప్రూఫ్స్. ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే లెక్కలు ఎక్సెల్‌ షీట్‌లో, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో, ఫోన్లలో రికార్డ్‌ అయ్యాయి. అవన్నీ.. అమెరికా కోర్టు ముందు ఉన్నాయి. ఆ డిటైల్స్‌ కూడా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి