Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రత్యేకతలు ఇవే.. చాలామంది ఈ విషయాలు గమనించి ఉండరు

వందే భారత్ స్లీపర్ రైళ్లు భారత్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తొలి రైలు ఈ నెల 17న ప్రారంభమైంది. ఈ రైళ్లలోని ఫీచర్లు, సదుపాయాల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రైళ్లో విమానం తరహాలో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రత్యేకతలు ఇవే.. చాలామంది ఈ విషయాలు గమనించి ఉండరు
Vande Bharat Sleeper

Updated on: Jan 28, 2026 | 4:41 PM

వందే భారత్ తొలి స్లీపర్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి రైలు హౌరా-గువహతి మధ్య ఈ నెల 17న ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. త్వరలో దేశవ్యాప్తంగా మరిరికొన్ని రూట్లలో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-ఢిల్లీ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ రూట్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ నడుస్తూండగా.. ఇందులో ప్రయాణ సమయం ఒకరోజు పడుతుంది. అదే వందే భారత్ స్లీపర్ రైలు వస్తే జర్నీ సమయం మరింత తగ్గుతుంది. దీంతో పాటు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వందే భారత్ స్లీపర్ రైళ్ల గురించి  ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

కోచ్‌లు ఎన్నంటే..?

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. 823 మంది ఒకేసారి ప్రయాణించే సామర్థ్యం ఉంది. 11 ఏసీ త్రీ టైర్, 4 ఏసీ టూ టైర్, , ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

అత్యాధునిక బెర్త్‌లు

ఈ ట్రైన్స్‌లో బెర్త్‌లు చాలా లగ్జరీగా ఉంటాయి. మెరుగైన కుషనింగ్‌తో ఎర్గానమిక్‌గా రూపొందించిన బెర్త్‌లు ఉంటాయి. ఎగువ బెర్త్‌లకు ఎక్కడానికి నిచ్చెన ఉంటుంది. వీటిల్లో బయట శబ్దాలు, కుదుపులు ఏం ఉండవు. దీంతో రాత్రిపూట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా నిద్రపోతూ ప్రయాణించవచ్చు.

వేగం ఎంతంటే..?

వందే భారత్ స్లీపర్ రైళ్ల వేగం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీంతో వీటిని సెమీ హై స్పీడ్ రైళ్లుగా పిలుస్తున్నారు.

డ్రైవర్ క్యాబిన్

ఈ రైళ్లు బుల్లెట్ ట్రైన్ల మాదిరిగానే ఏరో డైనమిక్ బాహ్య రూపాన్ని కలిగి ఉంటాయి. ప్రయాణ సమయంలో వేగంగా తిరగవచ్చు. ప్రతి చివర డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. ఈ రైలులో లోక్ పైలట్‌కు ఆటోమేటిక్ ఎగ్జిట్, ప్రవేశ ద్వారాలు ఉంటాయి.

అత్యాధునిక టాయిలెట్లు

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అత్యాధునిక టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. విమానాల తరహాలోనే ఇందులో మాడ్యులర్ బయో వాక్యూమ్ టాయిలెట్లు కలిగి ఉంటాయి. ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణికుల కోసం షవర్ క్యూబికల్ ఏరియా ఉంటుంది. ఇక ఈ రైల్లో ఒక టాయిలెట్ దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉంటుంది.

భద్రతా వ్యవస్థలు

ఈ రైల్లో స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన కవచ్ యాంటీ కొలిషన్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. ఇక మెరుగైన అగ్ని భద్రతా ఏరోసోల్ ఆధారిత అగ్ని గుర్తింపు, అణచివేత వ్యవస్థ ఉంటుంది. దీంతో అగ్ని ప్రమాదాల సమయంలో ఇవి రక్షిస్తాయి.

టికెట్ల బుకింగ్ నిబంధనలు

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో వెయిటింగ్, ఆర్ఏసీ టికెట్లు ఉండవు. కేవలం కన్ఫార్మ్‌డ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక రైలు బయల్దేరడానికి 8 గంటల్లోపు టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్ ఉండదు. 8 గంటల ముందు రద్దు చేసుకుంటూ వాపసు ఉంటుంది.