EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..! అసలు లెక్కలు తెలుసుకోండి..

కేంద్రం గత నెలలో ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెన్షన్ పరిధిపై అనేక సందేహాలు వస్తున్నాయి. దీంతో ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ఎవరు పెన్షన్ పరిధిలోకి వస్తారు.. ఎవరు అనర్హులు అనే దానిపై స్పష్టతిచ్చింది.

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..! అసలు లెక్కలు తెలుసుకోండి..
Epfo

Updated on: Oct 15, 2026 | 11:13 AM

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ విషయంలో కీలక నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ గరిష్ట శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రూ.25 వేల వరకు జీతం పొందేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరి కానుంది. దీని వల్ల కొత్తగా దేశవ్యాప్తంగా 51 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందే పీఎఫ్ ప్రయోజనాలు లభించనున్నాయి. అయితే ఈపీఎఫ్‌లో ఉన్నవారికి కేంద్రం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS) కింద పెన్షన్ కూడా అందిస్తోంది. అయితే ఈపీఎఫ్‌లో ఉన్న ప్రతీఒక్కరికీ పెన్షన్ లభించదు. దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి. కేంద్రం వేతన పరిమితి రూ.25 వేలకు పెంచిన క్రమంలో ఎవరెవరు ఈపీఎస్ పరిధిలోకి వస్తారనేది తెలుసుకుందాం.

పెన్షన్ ఎవరెవరికి వస్తుందంటే..?

ఈపీఎఫ్, ఈపీఎస్ పథకానికి అర్హతా ప్రమాణాలు ఒకేలా ఉండవు. దీంతో ఈపీఎఫ్ఓలో ఉన్నంత మాత్రాన పెన్షన్ పరిధిలోకి వస్తారనది ఆశించకూడదు. దీనికి సంబంధించి తాజాగా ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. రూ.25 వేలకుపైగా జీతం పొందేవారు గతంలో పెన్షన్ పథకంలో చేరి ఉంటే వారికి ఇప్పుడు యథావిధిగా పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో అలాంటివారు ఒక్కసారి పెన్షన్ పరిధిలో ఉన్నారో.. లేదో చెక్ చేసుకోవాలి. గతంలోనే ఈపీఎస్ సభ్యుడిగా ఉంటే ఇప్పుడు జీతం పెరిగినా సభ్యత్వం కొనసాగుతుంది. అయితే కొత్తగా ఈపీఎఫ్ఓలో చేరేవారిలో అధిక జీతం పొందుతున్నవారికి ఈపీఎస్ స్కీమ్ వర్తించదు. గతంలో పింఛన్ పథకంలోకి రానివారు, నిర్ధిష్ట వేతన శ్రేణుల్లో ఉన్నవారికి ఇప్పుడు పెన్షన్ కవరేజీ లభిస్తుంది. ఎక్కువ శాలరీలు పొందేవారికి మాత్రం ఈ పరిధిలోకి రాకపోవచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో కాంట్రిబ్యూషన్ కనిపిస్తున్నంత మాత్రాన ఈపీఎస్ సభ్యత్వం ఉన్నట్లు కాదు. ఒకసారి మీ సభ్యత్వ స్టేటస్ చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శాలరీ రూ.25 వేల కంటే తక్కువ ఉంటే పెన్షన్ పథకంలో చేరడం తప్పనిసరి. ఆపైన జీతం పొందేవారికి తప్పనిసరి కాదు.

ఉద్యోగం మానేశాక పెన్షన్ వస్తుందా..?

ఉద్యోగం మానేసిన తర్వాత వెంటనే పెన్షన్ రాదు. ఈపీఎఫ్ఓలో మీ సర్వీస్ పీరియడ్‌ను బట్టి అర్హతలు ఉంటాయి. మీరు మొత్తం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 58 ఏళ్ల తర్వాతనే పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ముందుగానే 50 ఏళ్లకు పింఛన్ పొందాలంటే కొత విధిస్తారు. ప్రతీ నెలా వీటిని మీ అకౌంట్లో జమ చేశారు. అయితే సర్వీస్ కాలం 10 ఏళ్లు పూర్తి చేసి ఉండకపోతే ఉద్యోగం మానేసిన కొన్ని రోజుల తర్వాత విడ్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫారం 10సీ సమర్పించడం ద్వారా పెన్షన్ సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. కేంద్రం వేతన పరిమితిని పెంచిన క్రమంలో పెన్షన్ పరిధిలోకి మీరు వస్తారా.. లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.

Loading...
Unable to load recommendations.
Follow Us