
ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారిలో చాలామంది పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటారు. ప్రతీ నెలా మీ జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి పీఎఫ్ ఖాతాలో యాజమాన్యం జమ చేస్తూ ఉంటారు. అలాగే యాజమాన్యం తన చందాగా మరికొంత అందిస్తుంది. ఖాతాదారుడు ఉద్యోగం మానేసిన కొన్ని నెలల తర్వాత వీటి మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఉద్యోగంలో ఉన్నప్పుడు అవసరమైతే పాక్షిక విత్ డ్రాయల్ ఆప్షన్ ద్వారా కొంతమొత్తం తీసుకోవచ్చు. ఖాతాలో ఉన్న మొత్తం అమౌంట్‌లో 75 శాతం వరకు ఉద్యోగంలో ఉన్నప్పుడే విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. విత్ డ్రా రూల్స్‌లో ఇటీవల ఈపీఎఫ్ఓ కొన్ని మార్పులు చేసింది. ఈ రూల్స్ తెలుసుకోకపోవడం, కొన్ని తప్పులు చేయడం వల్ల పీఎఫ్ క్లెయిమ్ రాకపోవచ్చు.
మీరు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని విషయాలు తనిఖీ చేసుకోవాలి. కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్, పాన్ వివరాలు పీఎఫ్ అకౌంట్‌తో అనుసంధానించబడి ఉండాలి. ఇక పీఎఫ్ పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసి ఉంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కరెక్ట్‌గా ఉండాలి. అకౌంట్ వివరాలు తప్పుగా ఉంటే మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవ్వవు. బ్యాంకుల విలీనమైన క్రమంలో పాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉంటే సమస్యలు తలెత్తుతాయి. దీంతో కొత్త నెంబర్ అప్డేట్ చేయాలి. మీరు ఉద్యోగం మానేసిన తర్వాత్ విడ్ డ్రా చేస్తుంటే ఎగ్జిట్ డేట్ నమోదై ఉండాలి. ఎగ్జిట్ డేట్ ఎంట్రీ కాకపోతే క్లెయిమ్ అందదు. ఇక క్లెయిమ్ కోసం సరైన ఫారంను ఎంచుకోవాలి. పీఎఫ్ అడ్వాన్స్ కోసం అయితే ఫారం 31 ఉపయోగించాలి. ఇక ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం అయితే ఫారం 19 ఎంచుకోవాలి. అదే పెన్షన్ విత్ డ్రా కోసమైతే ఫారం 10సీ నింపాల్సి ఉంటుంది.
మీరు ఫారంను తప్పుగా ఎంచుకుంటే క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పవచ్చు. అసంపూర్తిగా ఉన్న కేవైసీ వివరాలు, ఈపీఎఫ్ఓ ప్రొఫైల్, బ్యాంక్ వివరాలు, సర్వీస్ హిస్టరీ వంటివి తనిఖీలు చేసుకోవాలి. అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉంటే మూడు రోజుల్లోనే నగదు మీ అకౌంట్లో జమ అవుతుంది. వివరాలు తప్పుగా ఉంటే క్లెయిమ్ వెంటనే రిజెక్ట్ అయ్యే అవకాశముంటుంది. మళ్లీ వివరాలు చెక్ చేసుకుని క్లెయిమ్ సమర్పించాలంటే ప్రక్రియలో జాప్యం జరుగుతుంది.